రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలుపు

Sports

అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మురిసింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 49 పరుగుల తేడాతో మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జయభేరి మోగించింది. ఈ పోరులో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అలరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (28 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడింది. టెయిలెండర్‌ కమిన్స్‌ (12 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *