భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Business

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడోరోజు ధరలు తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా ధర క్షీణించింది. హైదరాబాద్ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.760 మేర భారీగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,470 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.700 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,100కి పడిపోయింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) మూడోరోజు దిగొచ్చాయి. తాజాగా రూ.540 మేర భారీగా ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,460కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.500 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,000 అయింది.

వెండి ధర (Silver Rate in India) వరుసగా నాలుగోరోజు భారీగా పతనమైంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.1,600 మేర తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.59,000కి క్షీణించింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *