మైనర్ బాలిక పై దారుణం..

Crime

మాయమాటలు చెప్పి మైనర్‌ బాలికను గర్భవతిని చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (14) స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన శవ్వ మహేశ్‌ ఏడాదిగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. స్కూల్‌, కిరాణానికి వెళ్లే సమయంలో వేధించేవాడు. మాట్లాడకుంటే చంపేస్తానని బెదిరించి, ఏడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. గర్భం దాల్చినట్టు తెలియడంతో ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించి రెండు నెలలు మీ అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉండాలని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించాడు. రెండు నెలల తర్వాత తిరిగి వచ్చేసరికి మహేశ్‌కు మరో అమ్మాయితో ఆగస్టులో వివాహం జరిగినట్టు తెలియడంతో బాలిక అతడిని ప్రశ్నించింది. మీ తల్లిదండ్రులతో మాట్లాడి నిన్ను కూడా పెండ్లి చేసుకుంటానని, ముందు అబార్షన్‌ చేయించుకోవాలని నమ్మించి 18న ఓ ప్రయివేటు క్లినిక్‌నూ సంప్రదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *