ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

Politics

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో ముంపు సమ స్యను అధిగమించటానికి శాశ్వతంగా పరి ష్కారం త్వరలో ట్రంక్‌లైన్‌తో లభిస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కార ణంగా వరద నీటితో ముంపునకు గురైన ప్రాంతాలను ఆదివారం అర్ధరాత్రి, సోమవారం పరిశీలించారు. ఇబ్బందులలో ఉన్న ప్రజలకు ఆహారం, తాగునీళ్లు, పాలు ఇతర వస్తువులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. రూ.23 కోట్ల నిధులతో చేపట్టిన ట్రంక్‌ లైన్‌ పనులు చివరి దశలో ఉన్నాయని, పూరైతే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మిథుల నగర్‌, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, సాయి నగర్‌లలో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ముంపు ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ దుర్గా దీప్‌ లాల్‌ చౌవాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రమ్‌ రెడ్డి, కార్పొరేటర్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ముంపు కాలనీలలో పాలు నీళ్లు పంపిణి చేసిన మీర్‌ పేట్‌ పోలీసులు
రోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మీర్‌ పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో ముంపుకు గురైన మిథులా నగర్‌, సాయి నగర్‌ ఇతర కాలనీలలో ప్రజలకు మీర్‌ పేట్‌ సిఐ మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పాలు, మంచి నీళ్లు, ఆహార పొట్లాలు పంపిణి చేశారు. ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *