స్టోక్స్ వచ్చేనా.. రాజస్థాన్ బెంగ తీరేనా..?

Crime

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే.. వివిధ దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లంతా కలిసి ఆడే గొప్ప ఈవెంట్..! అప్పుడప్పుడు కొన్ని కొన్ని కారణాల వలన కొందరు ఆటగాళ్లు జట్లకు దూరమవుతూ ఉంటారు. అయితే స్టార్ ఆటగాళ్లు ఒక్కోసారి దూరమైతే మాత్రం ఆయా ఫ్రాంచైజీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అలాంటి ఆటగాళ్ల లిస్టులోనే బెన్ స్టోక్స్ ఉంటాడు. బెన్ స్టోక్స్ ఏ జట్టులో ఉన్నా కూడా బలమే.. అందుకే రాజస్థాన్ రాయల్స్ జట్టులో అతడు స్టార్ ఆటగాడయ్యాడు. రాజస్థాన్ కు మంచి విజయాలు అందించాడు ఈ స్టార్ ఆల్ రౌండర్..!ఇక ఐపీఎల్ మొదలవ్వడానికి కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికీ బెన్ స్టోక్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరనున్నాడో లేదో క్లారిటీ లేదు. బెన్ స్టోక్స్ తండ్రికి బ్రెయిన్ క్యాన్సర్ రావడంతో గత నెలలో పాకిస్థాన్ తో టెస్ట్ సిరీస్ నుండి వైదొలిగాడు. అప్పటి నుండి స్టోక్స్ క్రికెట్ ఆడలేదు.రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ కూడా బెన్ స్టోక్స్ జట్టుతో ఎప్పుడు కలుస్తాడో తమకు కూడా సరైన అవగాహన లేదని తెలిపాడు. అతడికి కావాల్సిన సమయం తాము ఇస్తామని.. అతడికి ఇష్టమున్న సమయానికి రావచ్చునని ఆండ్రూ మెక్ డొనాల్డ్ చెబుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *