మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా

News

కొత్తగూడెం : మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇందులో భాగంగా 2016 నుంచి మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. మిషన్‌ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించింది. ఏటా ఆగస్టులో చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నారు. ఇప్పటికే 60 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. 2020 -21 ఆర్థిక సంవత్సరానికి గాను 691 చెరువుల్లో చేప పిల్లలను వదలడానికి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. గత నెల 6 నుంచి జిల్లాలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *