8 బిల్లులకు మండలి ఆమోదం

Politics

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8 బిల్లులను శాసనమండలి ఆమోదించింది. సోమవారం అసెంబ్లీలో ఆమోదించిన ఈ బిల్లులను మంగళవారం మండలిలో ప్రవేశపెట్టగా, సభ్యులు ఆమోదించారు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ సంతకం చేశాక చట్టంగా అమల్లోకి వస్తాయి.

శాసనమండలి ఆమోదించిన బిల్లులు ఇవే..

  1. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల బిల్లు-2020
  2. తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు-2020
  3. తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు-2020 (ఆయుష్‌ మెడికల్‌ కళాశాలల ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 ఏండ్లకు పెంచేందుకు ఉద్దేశించినది)
  4. తెలంగాణ ఫిస్కల్‌ రెస్సాన్స్‌బిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు-2020
  5. తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు-2020
  6. తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్‌బీపాస్‌) బిల్లు 2020
  7. తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు-2020
  8. తెలంగాణ సివిల్‌ న్యాయస్థానాల సవరణ బిల్లు- 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *