ప్రకాశం జిల్లాలో మరో 649 కరోనా కేసులు నమోదు

News

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 649 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,607కు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 138 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 395 మంది కరోనాతో మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 85 మంది డిశ్చార్జ్ అయ్యారు. 85 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 13,655 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *