ఎరువుల కర్మాగారాన్ని బీజేపీ కార్యాలయంలా మార్చారు

Politics

హైదరాబాద్‌: కేంద్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రామగుండం ఎరువుల కర్మాగారంలో సమీక్షకు ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు. కానీ ప్రొటోకాల్‌ పాటించలేదు. స్థానిక ఎంపీగా నాకు ఆహ్వానం అందలేదు. ఈ సందర్భంగా ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కూడా అబద్ధాలు చెప్పడం విడ్డూరం. తెలంగాణకు రావాల్సిన 13 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 6.25 లక్షల టన్నులు రాష్ట్రానికి కేటాయించమని బీజేపీ నేతలు చెప్పడం తప్పు. ఇప్పటి వరకు 1.17 మిలియన్ టన్నుల యూరియా కూడా రాష్ట్రానికి అందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *