సీఎంతో రాజకీయాలు చర్చించలేదు: చాడ

Politics

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌తో తాను సమావేశమైన సందర్భంగా రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని, కేవలం రెవెన్యూ బిల్లుపైనే చర్చించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. రెవెన్యూ బిల్లుపై గతంలో సీపీఐ, టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వెల్లడైన సూచనలతో పాటు, తమ పార్టీ అభిప్రాయాలను ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. శనివారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకురాలు పశ్య పద్మతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీపీఐ ఆధ్వర్యంలో అనేక రౌండ్‌ సమావేశాలు నిర్వహించడమే కాకుండా భూమి, రెవెన్యూ అంశాలపై సీఎంకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *