బోల్డ్ పాత్రలో నటించనున్న సీనియర్ నటి శ్రియ.

Entertainment

హిందీ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో వచ్చి సూపర్ హిట్ అయిన అంధాధున్ సినిమాను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా ఉండే టబు పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తే బాగుంటదని ఆలోచిస్తోన్న చిత్రబృందం ఈ పాత్ర కోసం చాలా మందినే పరిశీలించింది. కొంత నెగెటివ్ టచ్, కొంత బోల్డ్‌గా ఉండే ఈ పాత్రను తెలుగులో కూడా ఆమె చేయనుందని కొన్ని రోజులు టాక్ నడిచింది. ఆ తరువాత ఆ పాత్ర యాంకర్ అనసూయకు దక్కిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులు రమ్యకృష్ణ అంటూ టాక్ నడిచింది. అయితే ఈ పాత్ర చేయాలంటే రమ్య కృష్ణ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోందట. దీంతో ఈ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాని కూడా పరిశీలించిందట చిత్రబృందం. అయితే ఆ పాత్రకి ఆమె సింపుల్‌గా నో చెప్పేసిందట. దీనికి కారణం లేకపోలేదు. ఇలియానా గతంలో నితిన్‌తో రెచ్చిపో అనే సినిమా చేసింది. అందుకే మళ్ళీ ఇప్పుడు నితిన్ తో నెగటివ్ క్యారెక్టర్ చేస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోతుందని భావించిఉండవచ్చని అంటున్నారు. ఇక అదే పాత్రకోసం మరో హిందీ నటి శిల్పాశెట్టిని సంప్రదించగా.. ఆమె కూడా బిజీ అని చెప్పి..’నో’ చెప్పినట్లుగా టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *