ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా : 2-1 తో సిరీస్ కోల్పోయిన ఆసీస్…

Sports

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో నిన్న జరిగిన చివరి మ్యాచ్ ఆసీస్ గెలిచింది. అయితే ఇంతకముందు జరిగిన రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ ఆసీస్ ను వైట్ వాష్ చేయాలనీ చూసింది. కానీ చివరి మ్యాచ్ గెలిచిన ఆసీస్ 2-1 తో సిరీస్ కోల్పోయింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అందులో వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (55) హాఫ్ సెంచరీ తో రాణించాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ జంపా రెండు వికెట్లు, హజల్‌వుడ్, స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, అగర్ ఒక్కో వికెట్ తీశారు.

ఆ తర్వాత చేధనలోకి దిగ్గిన ఆసీస్ 19.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆసీస్ బ్యాట్స్మెన్స్ లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (39), మిచెల్ మార్ష్ (39) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు, మార్క్ వుడ్, టామ్ కుర్రాన్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఇక ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ మార్ష్ అందుకోగా ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గా జోస్ బట్లర్ నిలిచాడు. మళ్ళీ ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 11 నుండి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *