ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై వేటు.. స్టీవ్‌స్మిత్ ఆశ్చర్యం

Sports

ఇంగ్లాండ్ టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్‌కి టీ20 జట్టులో చోటు దక్కకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్ తలపడనుండగా.. మంగళవారం ఇంగ్లాండ్‌, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వన్డే, టీ20 జట్లని ప్రకటించింది. వన్డే జట్టులోకి జో రూట్‌ని ఎంపిక చేసిన ఈసీబీ.. టీ20 టీమ్‌లో మాత్రం చోటివ్వలేదు. మూడు ఫార్మాట్లలోనూ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా ఉన్న జో రూట్‌ టీ20 టీమ్‌లో లేకపోవడమేంటి..? అని స్టీవ్‌స్మిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఇంగ్లాండ్ టీ20 జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోప్రా ఆర్చర్, జొనాథన్ బెయిర్‌‌స్టో, టామ్ బాంటన్, శామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, శామ్ కరన్, టామ్ కరన్, జో డెన్లీ, క్రిస్‌ జోర్దాన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్…….. రిజర్వ్ ఆటగాళ్లు: లివింగ్‌స్టోన్, ఎస్. మహ్మద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *