ఎఫ్ 3కి లైన్ క్లియర్ అయినట్టే.!

Entertainment

కరోనా, లాక్ డౌన్ వల్ల వెనక్కి వెళ్లిపోయిన సినిమాల్లో ఎఫ్ 3 ఒకటి. అన్నీ బాగుంటే. ఈ సంక్రాంతి రేసులో.. ఎఫ్ 3 ఉండేది. 2022 సంక్రాంతికైనా ఎఫ్ 3 వస్తుందా? రాదా? అనే డౌటు మొదలయ్యిందిప్పుడు. ఎందుకంటే. అటు వెంకీ, ఇటు వరుణ్ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీ. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమా చేద్దామనుకున్నాడు అనిల్ రావిపూడి. అందుకు తగిన స్క్రిప్టు కూడా రెడీ చేసుకున్నాడు. కానీ.. ఇంతలోనే ఎఫ్ 3పై మళ్లీ ఆశలు మొదలయ్యాయి.

ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రారంభించమని వెంకీ చెప్పాడట. వీలైతే అక్టోబరులో మొదలెట్టడానికి రెడీగా ఉండమని అనిల్ రావిపూడికి సూచించాడట. అనిల్ ఎప్పుడో ఈ స్క్రిప్టు మొత్తం సిద్ధం చేసేశాడు. కాబట్టి. ఎప్పుడంటే అప్పుడు సినిమా మొదలెట్టడానికి తను రెడీనే. ఇక్కడ ప్రధాన సమస్య. వరుణ్ తేజ్ డేట్లు దొరకడం. దాంతో పాటు ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడు. అతనెవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ రెండింటిపై ఓ క్లారిటీ వస్తే.. ఎఫ్ 3కి లైన్ క్లియర్ అయినట్టే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *