‘ఆచార్య’ కోసం కొరటాల ప్లాన్ !

Entertainment

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెడతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో కొరటాల లేరని తెలుస్తోంది. మరో రెండు నెలలు వరకూ ఆగుదాం అనే ఆలోచనలో మెగాస్టార్ కూడా ఉన్నారట.

అయితే కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి, కేవలం సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట కొరటాల. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ ను కూడా మార్చారు. అన్నట్టు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *