ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం

Politics

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల వరకు 16.01 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. మొత్తం 25.97 శాతం మందికి పెన్షన్ల పంపిణీ జరింది. రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం రూ.1496.07 కోట్లు విడుదల చేసింది. ఈనెలలో కొత్తగా 90,167 మందికి పెన్షన్‌ను అందించనుంది. కొత్త పెన్షన్‌దారుల కోసం రూ.21.36 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 2.68 మంది వాలంటర్లు.. లబ్ధిదారుల చేతికే పెన్షన్‌ను అందిస్తున్నారు. బయోమెట్రిక్‌తోనే పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *