కోవిడ్ నిబంధనలతో మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలు

News

Last rites of former President Pranab Mukherjee: న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్‌ ముఖర్జీ (84) సోమవారం ఢిల్లీలోని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే.. మంగళవారం ఉదయం 8గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుంచి పార్థీవ దేహాన్ని రాజాజీమార్గ్‌లోని ప్రణబ్ అధికారిక నివాసానికి తరలించనున్నారు. ముందుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రముఖులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించనున్నారు. ఆ తరువాత 11 గంటల నుంచి 12 గంటల వరకు సాధారణ ప్రజల సందర్శనార్థానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సైనిక గౌరవ వందనం.. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. 2 గంటలకు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో ప్రణబ్ ముఖర్జీకి అంతిమ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అయితే కోవిడ్19 నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలాఉంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళిగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 6వరకు కేంద్ర ప్రభుత్వం 7రోజుల సంతాప కాలాన్ని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *