ఏపీలో 120 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే.. జనవరి 1న శ్రీకారం..

Politics

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్ర భూ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రం ఏపీనే 1930 తర్వాత చేపడుతున్న తొలి భూముల రీసర్వే భూ యజమానులు రైతులకు ఇకపై శాశ్వత హక్కులు ఏ వ్యక్తీ భూముల వివరాల్లో మార్పులు చేర్పులు చేయలేరు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగిన రెవెన్యూ శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో భూముల సమగ్ర రీసర్వేపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించాలని, పట్టణ ప్రాంతాలకు కూడా సమగ్ర రీసర్వేను అమలు చేసేందుకు వీలుగా సర్వే బృందాలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించడం వల్ల రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతాయని, ఎక్కడా పొరపాట్లకు తావు ఉండదని సీఎం వివరించారు. భూ సర్వే కోసం కొనుగోలు చేసిన పరికరాలన్నీ గ్రామ సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. దీనివల్ల ఎప్పుడు ఎలాంటి అవసరమున్నా వినియోగించుకోవడానికి వీలవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *