యూపీలో దారుణం..తల్లి,సోదరుడిని కాల్చి చంపిన మైనర్.!

Crime

యూపీలో దారుణం చోటు చేసుకుంది. 16ఏళ్ల మైనర్ బాలిక తన తల్లి,సోదరుడిని పిస్టల్ తో కాల్చి హత్యచేసింది. అనంతరం తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్ రాజధానిలోని గౌతంపల్లిలోని వివేకానంద మార్గ్‌లో రాజేష్ దత్ బాజ్‌పాయ్, భార్య మాలిని, కుమారుడుతో పాటు 16 ఏళ్ల కుమార్తె నివాసముంటున్నారు. కాగా తండ్రి రాజేష్ దత్ బాజ్‌పాయ్ రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఢిల్లీలో నివసిస్తుండగా….తల్లి కుమారుడు,కుమార్తె తో కలిసి లక్నో లో నివసిస్తుంది. అయితే కుటుంబ కలహాల కారణంగా బాలిక నిద్రిస్తున్న తల్లి,సోదరుడిని కాల్చి చంపడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలాన్ని రాష్ట్ర డిజిపితో సహా పోలీసు అధికారులు పరిశీలించారు. హత్య చేసినట్టు బాలిక ఒప్పుకుంది. అంతేకాకుండా హత్య చేసిన తరవాత తన చేతిపై రేజర్ తో గాయం చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఏడుగురు పనివాళ్ళు సైతం ఉన్నారు. బాలిక గతంలో కూడా తండ్రిని వేధించినట్టు విచారణలో తేలింది. బాలిక జాతీయ స్థాయి షూటర్ అని తెలుస్తోంది. బాలికను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *