హరీశ్ రావును నిలదీస్తా: జగ్గారెడ్డి

Politics

హైదరాబాద్ : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మంత్రి హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు. సింగూరు, మంజీరా డ్యామ్‌లు నింపే వరకు నీళ్ల కోసం నా పోరాటం ఆగదని ఆయన ప్రకటించారు. తమ ఎంపీ ఒక్కసారి కూడా నీళ్ల కోసం నోరు తెరవలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా డమ్మీనే అని జగ్గారెడ్డి విమర్శించారు. త్వరలోనే మంత్రి సమావేశంలో పాల్గొని నీళ్ల విషయంలో నిలదీస్తానని ఆయన ప్రకటించారు. తన మీద టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేస్తే ప్రతిదాడి చేస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు. తన బలగం, కుటుంబంతో మంత్రి సమావేశానికి వెళతానని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు పోలీసుల బలం ఉంటే.. నాకు కార్యకర్తల బలం ఉందని జగ్గారెడ్డి అన్నారు. తాను దేనికి వెనకాడబోనని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *