భార్యలు అలిగి పుట్టింటికి.. భర్తల ఆత్మహత్య !

Crime

గుంటూరు జిల్లాలో వరుసగా ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని ఐదుగురు మృతి చెందారు. బాపట్లలో భార్యలు కాపురానికి రావటం లేదని ఇద్దరు భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. పొన్నూరు మండలం నండూరు గ్రామంలో పురుగులు మందు తాగి వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వయసు మీద పడ్డాక పిల్లలలు పట్టించుకొకపోవటంతో బలవన్మరణానికి పాల్పడ్డారు దంపతులు. దీంతో భర్త అంకమరావు, భార్య వెంకాయమ్మ మృతి చెందారు. ఇక మంగళగిరిలో భార్య, భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు, లాక్ డౌన్ వలన ఏర్పడిన ఆర్దిక ఇబ్బందులుతోనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళగిరి పట్టణంలోని మసీదు వీధిలో నివాసముండే వీరిలో భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

భార్యలు పుట్టింటికెళ్లారని ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు భర్తలు ఆత్మహత్య చేసుకున్న వివరాల్లోకి వెళ్తే బాపట్లలోని కొండలరావు వీధిలో నివాసముంటున్న మున్నా(30) భార్య భర్తతో గొడపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే తరహాలో బాపట్లలో కోకి దుర్గారెడ్డి (37) దంపతులు పట్టణంలోని విజయలక్ష్మీపురంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో దుర్గారెడ్డి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన భర్త ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఒకే రోజు రెండు ఆత్మహత్య ఘటనల మీద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *