మార్క్రమ్‌, ముల్డర్‌ సెంచరీలు

Sports

మైసూర్‌ : భారత్‌-ఏ, దక్షిణాఫ్రికా-ఏ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికార టెస్ట్‌ డ్రా దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5 వికెట్లు నష్టానికి 159 పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా-ఏ జట్టును మార్క్రమ్‌(161), ముల్డర్‌(131నాటౌట్‌) ఆదుకున్నారు. చివర్లో బ్రుయాన్‌(41)కూడా చెలరేగడంతో దక్షిణాఫ్రికా-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 400 పరుగుల వద్ద ముగించింది. కుల్దీప్‌కు నాలుగు, నదీమ్‌కు మూడు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-ఏ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ప్రియాంక్‌ పంచల్‌(9), అభిమన్యు ఈశ్వరన్‌(5) క్రీజ్‌లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *