ఇక వార్డు సెక్రటేరియట్లలోనే ‘స్పందన’

News

ప్రజాసమస్యల పరిష్కారంలో వేగాన్ని పెంచే దిశగా వార్డు సచివాలయాల్లో కూడా నిత్యం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌, కార్పొరేషన్ల కమిషనర్లు ఇందుకు సంబందించిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఆయన అమరావతి నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణాల అనుమతుల విషయంలో వస్తున్న ఆరోపణలు, అక్రమాలకు తావివ్వకుండా ఉండేట్లు చూసేందుకు రాష్ట్ర స్ధాయిలో ముగ్గురు అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. . వార్డు సెక్రటరీల వేతనాలన్నీ సకాలంలో అందేలా చూడాలని కమిషనర్లకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణం కోసం లబ్ధిదారుల ఎంపిక సర్వే విషయంలో జాప్యం చేయవద్దని, అర్హులైన అందరినీ గుర్తించడంతోపాటు అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత కమిషనర్లదేనన్నారు. నాడు-నేడు పురపాలక పాఠశాలల స్థితిగతులు , పారిశుద్ధ్య నివారణ తదితర అంశాలపై కూడా మంత్రి సమీక్షించారు. అన్ని మునిసిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణనుఅత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలని సూచించారు .రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబందించిన అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామల రావు, పురపాలకశాఖ కమిషనరు జి.విజయకుమార్‌, టిడ్కో ఎండి దీవాన్‌తో పాటుఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *