దుర్గమ్మ సన్నిధిలో కీలక ఘట్టం..! సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ఆలయాలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప!ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కూల్చిన ఆలయాలకు భూమి పూజ చేశారు. విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పునాదిరాయి వేశారు. అలాగే రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి […]

Continue Reading

మార్చిలోగా సింగరేణిలో ఉద్యోగాల భర్తీ

హైదరాబాద్‌: సింగరేణిలో మార్చిలోగా వివిధ విభాగాల్లో 651 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్‌ వెల్లడించారు. ఈ మేరకు 569 కార్మికులు, 82 అధికారుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే అంతర్గత సిబ్బందితో 1,436 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇంటర్వూ లేకుండా కేవలం రాత పరీక్ష, ప్రతిభ ఆధారంగా నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే మోసపోకూడదని సీఎండీ సూచించారు. […]

Continue Reading

బీజేపీని అందుకే మతతత్వ పార్టీ అంటున్నారు : బండి

తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్న నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతు వేదికలు, హరితరం పథకంకు కేంద్రం నిధులు ఇస్తు ఉంటే మోది ఫోటో ఎక్కడ పెట్టరు. కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన ఒక్క పథకం అయిన ఉందా అని బండి ప్రశ్నించాడు. గత 5 ఏళ్ళ లో కొత్త గా ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదు… కేసిఆర్ […]

Continue Reading

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కోళ్ళ మృత్యువాత. టెన్షన్ టెన్షన్ ?

కరోనాతో దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది. కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో కొత్త స్ట్రెయిన్ కేసుల రాకతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అదే సమయంలో బర్డ్ ఫ్లూ వైరస్ కూడా భయపెడుతున్నది. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ వైరస్ బయటపడింది. ఈ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పక్షులు మృతి చెందుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. […]

Continue Reading

ముంబయి పేలుళ్ల సూత్రధారికి 15 ఏళ్ల జైలు

లాహోర్‌: ముంబయి పేలుళ్ల సూత్రధారికి జైలు శిక్ష పడింది. ఉగ్రవాదులకు నిధులు అందించారనే కేసులో లష్కరే కమాండర్‌ జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడన్న అభియోగాలతో లఖ్వీని పాక్‌ ఉగ్రవాద నిరోధక శాఖ (సీడీటీ) గత శనివారం అరెస్టు చేయగా.. తాజాగా తీర్పు వెలువడింది. ముంబయి పేలుళ్ల కేసులో అరెస్టయిన లఖ్వీ.. 2015 నుంచి బెయిల్‌ పైనే ఉన్నాడు. అయితే, నిధులు […]

Continue Reading

ఎస్‌ఇసి నిమ్మగడ్డతో ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ..

అమరావతి : రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశం అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌ దాస్‌, పంచాయితీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ నిమ్మగడ్డను కలిసిన బృదంలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని కమిషన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది. హైకోర్టు సూచించిన మేరకు.. ప్రభుత్వం తరుఫున […]

Continue Reading

దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు..

దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందించాయి. రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడుగా సాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 689 పాయింట్లు జంప్‌చేసి 48,782 వద్దకు చేరగా నిఫ్టీ సైతం 209 పాయింట్లు ఎగసి 14,347 వద్ద స్థిరపడ్డాయి. పది రోజుల వరుస ర్యాలీకి గత రెండు రోజుల్లో బ్రేక్‌ పడినప్పటికీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల […]

Continue Reading

కారు, బైక్‌ ఢీకొని తల్లీకొడుకు మృతి

పెద్దపల్లి : కారు, బైక్‌ ఢీకొని తల్లీకుమారుడు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగపల్లి గ్రామానికి చెందిన దబ్బేట నాగరాజు (23) తల్లి రాజేశ్వరి (50) తో కలిసి బైక్‌పై మంథని వైపు వెళ్తున్నాడు. బట్టుపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి […]

Continue Reading

‘సీఎం సార్‌.. దయచేసి అర్థం చేసుకోండి’

హైదరాబాద్‌: రాజకీయంగా తమను వేధిస్తున్నారని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ఆరోపించారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అరెస్టయిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అఖిలప్రియకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఇబ్బంది పెడుతున్నారన్నారు. తన సోదరిపై తప్పుడు సెక్షన్లతో కేసులు పెట్టారని జగత్‌ విఖ్యాత్‌ ఆరోపించారు. అసలేమాత్రం సంబంధం లేని కేసులో అరెస్ట్‌ చేశారన్నారు. తమను ఇంతలా భయపెట్టి ఏం సాధించదలచుకున్నారని ఆయన ప్రశ్నించారు. ”హఫీజ్‌పేట భూములు మావే. వాటిపై ఎప్పటి […]

Continue Reading

దుష్యంతుడు ఎవరు?

`రుద్రమదేవి` వంటి చారిత్రాత్మక చిత్రం తీసి మెప్పించిన దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం పౌరాణిక సినిమా `శాకుంతలం`పై దృష్టి సారించారు. శకుంతల క్యారెక్టర్ చేయడానికి సమంత ఓకే అనేసింది. ఇటీవల టైటిల్ మోషన్ పోస్టర్ కూడా విడుదలైపోయింది. అయితే దుష్యంతుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దుష్యంతుడి పాత్రకు దగ్గుబాటి రానాను అడిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే రానా అంగీకరించలేదని సమాచారం. దీంతో మలయాళ, తమిళ హీరోల వైపు గుణశేఖర్ చూస్తున్నారట. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా […]

Continue Reading