మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

హైదరాబాద్‌: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కూకట్‌పల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అఖిలప్రియను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అయితే ఆమె భర్త భార్గవరామ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అఖిలప్రియను బేగంపేటలోని లెర్నింగ్‌ సెంటర్‌కు పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని […]

Continue Reading

సోనియాకు మాయావతిలకి భారతరత్న ఇవ్వాలి: మాజీ సీఎం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతికి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్ డిమాండ్ చేశారు. వీరిద్దరూ మహిళా సాధికారతను గణనీయంగా పెంపొందించారని, ఈ దేశానికి ఎంతగానో సేవ చేశారని ఆయన అన్నారు. ఈసారి ప్రకటించబోయే భారతరత్న అవార్డుల్లో సోనియా, మాయాలను భారతరత్నకు ఎంపిక చేసి గౌరవించాలని రావత్ డిమాండ్ చేశారు. బుధవారం ట్టిట్టర్ ద్వారా ఆయన ఈ […]

Continue Reading

ఆవులేగపై అమానుషం.. ఢిల్లీలో వ్యక్తి అరెస్ట్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవుదూడను తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం తీవ్ర గాయాలతో పడిపోయిన ఆవుదూడను ఏ మాత్రం పట్టించుకోకుండా పారిపోయాడు. తూర్పు ఢిల్లీలోని మండవాలీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. గాయపడ్డ ఆవుదూడను చికిత్స కోసం సంజయ్‌గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. మండవాలి ఏరియాకు చెందిన కమల్‌సింగ్ చేతిలో డాక్యుమెంట్లతో రోడ్డుపై వెళ్తుండగా తల్లి […]

Continue Reading

మహబూబాబాద్ జిల్లాలో తహసీల్దార్పై కర్రలతో దాడి

హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కంసాలితండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండల తహసీల్దార్‌పై దాడి జరిగింది. ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం తహసీల్దార్ రఫీయుద్దీన్‌.. సర్వేయర్‌, అధికారులతో వెళ్లారు. స్థల పరిశీలనకు వెళ్లిన అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. సామ్య, రవి అనే తండ్రీకొడుకులు తహసీల్దార్‌పై కర్రతో దాడి చేశారు. దాడిలో రఫీయుద్దీన్‌కు గాయాలయ్యాయి. తహసీల్దార్గార్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Continue Reading

సెల్ ఫోన్లు పంచిన సోనూ సూద్

హైదరాబాద్: చేతికి ఎముకే లేదన్నట్టుగా పెద్దమనసుతో దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి వార్తల్లోకెక్కారు. సోనూ సూద్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆచార్య యూనిట్ లో కార్మికులకు ఉచితంగా సెల్ ఫోన్లు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కార్మికులను గుర్తించి 100 సెల్ ఫోన్లు కానుకగా బహూకరించారు. సోనూ సూద్ నుంచి మొబైల్ ఫోన్లు అందుకున్న ఆ కార్మికులు సంతోషం వ్యక్తం […]

Continue Reading

100కిపైగా దేవాలయాలపై దాడులు : పవన్‌ కళ్యాణ్‌

రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100కిపైగా దేవాలయాలపై దాడులు జరిగాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. వైఎస్సార్‌ పార్టీ నేతలపై సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు.. కానీ రాష్ట్రంలో ఆలయాల్లోని విగ్రహాలు, గోపురాలు ధ్వంసం చేస్తున్నప్పడు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న ఆలయాల దాడులపై బుధవారం పవన్‌ కళ్యాణ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో రథాల దగ్ధం, దేవాతామూర్తుల విగ్రహాల ధ్వంసం […]

Continue Reading

వ్యాక్సిన్లు సిద్ధం.. మరి ప్రజలు సిద్ధమేనా?

దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్విరామంగా జరుగుతోంది. భారత్‌లో కూడా మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేయించుకోవడంపై ప్రజల స్పందన ఏంటి? వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అసలు వారి మనసుల్లో ఏముందో తెలుసుకోడానికి లోకల్‌ సర్కిల్స్‌ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఒక సర్వేను నిర్వహించింది. దీనిలో 26 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే తీసుకుంటామని తెలుపగా, 69శాతం […]

Continue Reading

గోల్డ్ మార్కెట్‌పై కరోనా ప్రభావం… పదేళ్ల కనిష్టానికి చేరుకున్న బంగారం దిగుమతులు

కరోనా గోల్డ్ మార్కెట్‌పై కూడా తీవ్రంగా ప్రభావం చూపిందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది మన దేశంలో బంగారం దిగుమతులు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ వల్ల ఆభరణాలకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. ధరలు కూడా ఎక్కువగా ఉండటంతో బంగారాన్ని కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపలేదు. దీంతో 2020లో దిగుమతులు 275.5 టన్నులకు పడిపోయినట్లు గోల్డ్ కౌన్సిల్ డేటా వెల్లడించింది. గతంలో 2009లోనే విదేశీ కొనుగోళ్లు ఇంత […]

Continue Reading

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు నర్సుల మృతి

ఓస్లో: కరోనా వైరస్ కోసం ఫైజర్‌-బయోఎన్‌టెక్ తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇద్దరు నర్సులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నార్వేలో ఈ ఘటన జరిగింది. దీనిపై మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ద నార్వేజియన్ ఏజెన్సీ, నార్వే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విచారణ మొదలుపెట్టింది. పోర్టోలో సోనియా అకెవెడో అనే 41 ఏళ్ల నర్సు.. వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల తర్వాత హఠాత్తుగా కన్నుమూసింది. అయితే ఆమె మరణానికి వ్యాక్సినే కారణమా లేక యాదృచ్ఛికంగా […]

Continue Reading

‘నువే..నువే’ 93 సెకన్స్‌ ట్రీట్‌

హైదరాబాద్‌: రామ్‌ హీరోగా నటిస్తున్న ‘రెడ్‌’చిత్రంలోని మరో వీడియో సాంగ్‌ బిట్‌ను మంగళవారం విడుదల చేశారు. నువే..నువే అంటూ సాగే మెలోడియస్‌ విజువల్‌ ట్రీట్‌ సాంగ్‌లో రామ్‌తో కలిసి మాళవికశర్మ రొమాన్స్‌ చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, రమ్యబెహ్రా గీతాన్ని ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. సంక్రాతి పండగ సందర్భంగా ఈ చిత్రం జనవరి 14న నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే డించక్‌..డించక్‌ అంటూ సాగే ఐటమ్‌సాంగ్‌ యూట్యూబ్‌లో […]

Continue Reading