ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 51,420 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 377 కొత్త కేసులు నమోదు కాగా.. నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,587కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7,122 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 278 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,73,427కి […]

Continue Reading

జగన్‌ హిందూ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారు: బీజేపీ నేత

విజయనగరం: జగన్‌ హిందూ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. దేవదాయ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై తాము దాడులు చేస్తున్నామన్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కట్టుబడి తమను అరెస్ట్ చేసి చూడమనండన్నారు. అశోక గజపతిరాజు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు క్షమించరాని విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక గజపతిరాజుని పదవి నుంచి తొలగించటం అన్యాయమన్నారు. అలాగే బీజేపీని చూసి వైసీపీ భయపడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

Continue Reading

ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.., ఇళ్ల పట్టాలపై కీలక ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తోంది. గత నెల 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. స్పందన కార్యక్రమంపై ఇళ్ల పట్టాల పంపిణీ తీరుపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు పూర్తైన ఇళ్ల పట్టాల పంపిణీని అడిగి తెలుకున్నారు.దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పంపిణీ ప్రక్రియ ఇప్పటివరకు 39శాతమే పూర్తైనట్లు అధికారులు […]

Continue Reading

ప్రభుత్వంపై కక్షతో రామతీర్థం ఘటన: సీఐడీ అడిషినల్ డీజీ

విజయనగరం: రామతీర్ధం సంఘటనా స్ధలాన్ని సీఐడీ అడిషినల్ డీజీ సునీల్ కుమార్ పరిశీలించారు. రామతీర్ధం ఘటన జరిగిన విధానం చూస్తుంటే ఎవరో కావాలనే చేసినట్టు ఉందని ఆయన తెలిపారు. లబ్ది కోసం, కక్ష కోసం దాడులు చేస్తారని చెప్పారు. ప్రభుత్వంపై కక్షతో ఈ ఘటనకు పాల్పడ్డారని తెలిపారు. తలను ఖండించడానికి ఉపయోగించిన రంపం దొరికిందన్నారు. చాలా ఆదారాలు సేకరించామని పేర్కొన్నారు. ఆలయంలో ఉన్న ఆభరణాలు గాని, వస్తువులు గాని దొంగతనం జరగలేదని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడానికే ఘటనకు […]

Continue Reading

‘బండి సంజయ్‌ తిరుపతికి వస్తే ఏం కావాల్నో చెబుతారు’

అమరావతి : తిరుపతి ఎన్నికల విషయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తిరుపతి ప్రజలు బైబిల్‌ కావాలో భగవద్గీత కావాలో తేల్చుకోవాలని బండి సంజయ్‌ అన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. తిరుపతి ఎన్నికల్లో బండి సంజయ్‌ తిరిగితే అప్పుడు తెలుస్తుందన్నారు. తిరుపతికి వస్తే తమకు ఏం కావాలో ప్రజలే చెప్తారన్నారు. మతాలను అడ్డుపెట్టుకునే పార్టీలకు మనుగడ ఉండదని […]

Continue Reading

టాలీవుడ్ లో విషాదం.. కన్నుమూసిన వెన్నెలకంటి

వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. 1979 లో చంద్రగిరి ఎస్.బి.ఐ. లో పనిచేస్తున్న వెన్నెలకంటి, సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో సినీరంగంలో అడుగుపెట్టారు. సినీ రంగంలో ఇంటి పేరు వెన్నెలకంటి గానే పేరు సంపాదించుకున్నారు. హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడమంటే మక్కువ చూపేవారట.. కాలేజీ రోజుల్లో “రసవినోదిని” రేడియో ప్రసంగాలు వింటూ గడిపేవారని ఆయన సన్నిహితులు తెలిపారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు. 1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 […]

Continue Reading

భారత్‌లో 71కి చేరిన యూకే కరోనా కేసులు

దిల్లీ: దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 71కి చేరిందని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బయో టెక్నాలజీ విభాగ కార్యదర్శి రేణు స్వరూప్‌ వెల్లడించారు. మంగళవారం ఉదయానికి 20 కేసులు పాజిటివ్‌ కేసులు పెరిగి మొత్తం సంఖ్య 58గా ఉంది. కాగా సాయంత్రానికి మరో 13 కేసులు పెరిగి 71కి చేరింది. సాధారణ కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా యూకే నుంచి వచ్చిన కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండటంపై ఆందోళన పెరుగుతోంది. యూకేలో […]

Continue Reading

7న ట్రైలర్ చూపిస్తాం: కేంద్రానికి రైతుల హెచ్చరిక

న్యూఢిల్లీ: జనవరి 7వ తేదీన ఢిల్లీ సరిహద్దులో ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహించి జనవరి 26 నాటి కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్‌ను కేంద్ర ప్రభుత్వానికి చూపిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. వాస్తవానికి జనవరి 8వ తేదీన రైతులు-కేంద్రం మధ్య ఎనిమిదవ దశ చర్చలు ఉన్నాయి. దానికి ఒక్క రోజు ముందే రైతులు ఈ ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునివ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. జనవరి 26వ తేదీన ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్ చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మంగళవారం ఢిల్లీ సరిహద్దులోని […]

Continue Reading

పెద్దగట్టు జాతర అభివృద్ధి పనులకు నిధుల విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు జాతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి గ్రామంలో శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ప్రతీ రెండేళ్లకోసారి జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగే జాతర ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మంత్రి జగదీష్‌రెడ్డి అభ్యర్థన మేరకు ప్రభుత్వం రూ. 2 కోట్లను విడుదల చేసింది.

Continue Reading

వెల్లంపల్లి తక్షణమే రాజీనామా చేయాలి: బాలవీరాంజనేయస్వామి

ప్రకాశం: శింగరాయకొండ ఆలయ ప్రాకారంలోని విగ్రహ ధ్వంసం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఈ ఘటన రెండు నెలల క్రితమే జరిగిందని అధికారులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దేవాదాయశాఖ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులను సంప్రదించకుండా అధికారులు ఎలా నిర్ధారణకు వస్తారని మండిపడ్డారు. ఆలయాలపై దాడులకు బాధ్యత వహిస్తూ దేవయదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష వల్లే రోజుకో ఘటన జరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని […]

Continue Reading