చెక్ చెప్పేందుకు మొదటి ఎత్తుగడ సిద్దమవుతుంది

నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన రంగ్‌దే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను మార్చి 26న వేసవి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. అయితే ఇంతలో నితిన్ తన తరువాతి సినిమా చెక్ మొదలు పెట్టేశాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ మంచి స్పందనను అందుకుంది. ఇటీవల న్యూఇయర్ కానుకగా చెక్ టీం మరో పోస్టర్‌ రిలీజ్ చేసింది. […]

Continue Reading

విగ్రహాల ద్వంసం.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేశారన్న ఆయన జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపాటి చర్యలు కూడా తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ఆలయ ఆస్తుల ధ్వంసానికి సర్కార్ బాధ్యత వహించాలన్న ఆయన ‘మూర్తీభవించిన ధర్మం శ్రీరామచంద్రుడు’ అంటూ మారీచుడు అనే రాక్షసుడు రావణాసురుడితో చెప్పాడు, త్రేతాయుగంలో ఒక రాక్షసుడు శ్రీరాముని గుణగణాలను ఉన్నతంగా చెబితే రాక్షస వారసులెవరో వర్తమానంలో […]

Continue Reading

గంగూలీ హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌..

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరారు.. ఇవాళ ఉదయం కోల్‌కతాలోని తన ఇంట్లోని వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు దాదా.. దాంతో.. హుటాహుటిన గంగూలీని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సౌరవ్‌కు గుండెపోటు వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త ఒక్కసారిగా గంగూలీ ఫ్యాన్స్‌ను, క్రికెట్ ప్రేమికులను, క్రీడాభిమానులకు షాక్‌కు గురిచేసింది.. దాదా త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే.. తాజాగా ఆయన ఆరోగ్యంపై బులిటెన్‌ను ఉడ్‌ల్యాండ్స్ […]

Continue Reading

లూసిఫర్‌కు జతగా అమ్మోరుతల్లి?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక జోరు పెంచాడు. వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఒకవైపు ఆచార్య సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలను ప్రకటించి అందరని ఔరా అనిపించాడు. అయితే చిరు వరుస సినిమాలు ప్రకటిస్తున్నాప్పటికీ అందులో హీరోయిన్లు దొరకడం కష్టం అయిపోయింది. హీరోయిన్ల విషయంలో చిత్ర టీం తెగ కష్ట పడుతోంది. అయితే ఇటీవల దర్శకుడిని ఓకే చేసుకున్న మెగాస్టార్ లూసిఫర్ సినిమా ఇప్పుడు హీరోయిన్ వేటలో పడింది. అయితే తాజాగా వస్తున్న […]

Continue Reading

ఏపీలో కొత్తగా 238 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 238 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వల్ల పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూర్‌లో ఒక్కరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 882850కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3194కు చేరగా..ఇప్పటి వరకు 872545 మంది కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 7111 మంది చనిపోయారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,19,32,603శాంపిల్స్‌ పరీక్షించారు.

Continue Reading

బీబీఎంపీ నిర్ణయంపై బీజేపీ ఎంపీ ట్వీట్

న్యూఢిల్లీ: బీబీఎంపీ నిర్ణయంపై కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని రహదారులకు ముస్లింల పేరు పెట్టాలనే ఆలోచనను బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) విరమించుకుందని బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ట్వీట్ చేశారు. ఈ అంశంపై బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ కు సూర్య లేఖ రాసిన తరువాత ఇది జరిగింది. ముస్లిమేతరులకు కొరత లేదని సూర్య కమిషనర్‌కు రాసిన లేఖలో […]

Continue Reading

అసాంఘిక శక్తులను నియంత్రించండి: స్వామి స్వరూపానందేంద్ర

విశాఖ: ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఖండించారు. అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవాదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి వెల్లంపల్లికి సూచించారు. ఈ ఘటనలపై మంత్రి వెల్లంపల్లితో స్వామి స్వరూపానందేంద్ర సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రతిష్టతో పాటు, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను నిరోధించడం అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. ఆలయాల భద్రత విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను సైతం అప్రమత్తం చేయాలన్నారు. మంత్రి వెల్లంపల్లితో పాటు […]

Continue Reading

ఐసొలేషన్‌లో ఐదుగురు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు

సిడ్నీ: ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత క్రికెట్ జట్టుకు చెందిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, ఫృథ్వీషా, నవదీప్ సైనీలను ఐసొలేషన్‌లో ఉంచినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా శనివారంనాడు తెలిపింది. ‘న్యూ ఇయర్స్ డే’ సందర్భంగా మెల్‌బోర్న్‌లోని ఔట్ డోర్ వెన్యూలో ఈ ఐదుగురు ఆటగాళ్లు ఆహారం తీసుకోవడంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఆస్ట్రేలియా, భారత వైద్య బృందాల సూచనల మేరకు ఐదుగురు భారత ఆటగాళ్లను ముందస్తు జాగ్రత్తగా ఐసొలేషన్‌కు పంపాం’ […]

Continue Reading

టీఆర్‌ఎస్‌వీ క్యాలెండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం 2021 కాల్యెండర్‌ను శనివారం తెలంగాణ భవన్‌లో ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్వీ వారధిగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు రవి కిరణ్, శ్రవణ్ కుమార్, కాటం శివ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading