తరగతి గదిలోనే క్లాస్‌మేట్‌ను కాల్చి చంపిన పదో తరగతి బాలుడు!

లక్నో: ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య సీటు కోసం తరగతి గదిలో జరిగిన గొడవ ఓ బాలుడి ప్రాణాలు తీసింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. క్లాస్ రూములో సీటు కోసం పదో తరగతి విద్యార్థులు ఇద్దరు నిన్న ఘర్షణ పడ్డారు. దీంతో కోపంతో రగలిపోయిన బాలుడు ఈ ఉదయం స్కూలుకు వస్తూవస్తూ తన అంకుల్ తుపాకిని వెంట తెచ్చుకున్నాడు. వచ్చీ రావడంతో తనతో గొడవకు దిగిన […]

Continue Reading

దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగింపు..

దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. గత కొద్దిరోజులుగా వరుస లాభాలతో దూసుకెళ్తున్న దేశీ సూచీలు ఏడాది చివరిరోజును మాత్రం సాదాగా ముగించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారి జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 14 వేల మైలు రాయిని దాటినప్పటికీ ఇన్వెస్టర్ల అప్రమత్తతతో చివరకు 13,981 వద్ద ముగిసింది. అటు బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ సైతం 5 పాయింట్ల స్వల్ప లాభంతో 47,751 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది మొత్తంగా చూస్తే […]

Continue Reading

సిడ్నీ టెస్టు:ఉమేశ్‌ స్థానంలో శార్దుల్‌!

సిడ్నీ: గాయం కారణంగా ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు దూరమైన పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్థానం కోసం ఇద్దరు బౌలర్లు పోటీపడుతున్నారు. వచ్చే వారం ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టుకు భారత తుది జట్టులో చోటు కోసం బౌలర్లు టీ నటరాజన్‌, శార్దుల్‌ ఠాకూర్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటరాజన్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో తగినంత అనుభవం లేకపోవడంతో శార్దుల్‌ను ఎంపిక చేసేఅవకాశాలున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి. శార్దుల్‌ వైపే టీమ్‌మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపుతోందని తెలిసింది. శార్దుల్‌ ఇప్పటి వరకు 62 ఫస్ట్‌క్లాస్‌ […]

Continue Reading

ఫాస్టాగ్‌ గడువును పొడిగించిన కేంద్రం?

దిల్లీ: ఫాస్టాగ్‌ను ఉపయోగించి జాతీయ రహదారులపై టోల్‌ ఫీజును చెల్లించే గడువును కేంద్రం మరోసారి పొడిగించినట్లు తెలుస్తోంది. పలు జాతీయమీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి స్థాయి ఫాస్టాగ్‌ చెల్లింపుల గడువును 2021 ఫిబ్రవరి 15 వరకూ పెంచారు. ఈ మేరకు రహదారి రవాణా మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు వెల్లడించారు. గతంలో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జనవరి 1, 2021 నుంచి ఫాస్టాగ్‌ ద్వారానే పూర్తిస్థాయి టోల్‌ చెల్లింపులు చేయాలని ప్రకటించింది. […]

Continue Reading

ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్‌దాస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు చేపట్టారు. ఇవాళ పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్నీ నుంచి ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ నియామకానికి సీఎం జగన్‌ ఆమోదముద్ర వేశారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ఆసీనులైన నూతన చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్‌కు వేదపండితుల ఆశీర్వచనాలు అందించగా పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని […]

Continue Reading

గాలిలో తేలిపోవద్దు.. టీమిండియాకు బేడీ వార్నింగ్

అడిలైడ్‌ టెస్టులో ఘోర పరాజయం నుంచి తెప్పరిల్లి పుంజుకుని అసీస్ జట్టును బాక్సింగ్ డే టెస్టులోనే మట్టి కరిపించడం ద్వారా టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే విమర్శకులందరినీ ఒక్క దెబ్బతో నోరుమూయించాడని భారత జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కొనియాడాడు. కానీ అదే సమయంలో ఘనవిజయం సాదించామని భారత జట్టు మేఘాల్లో తేలిపోరాదని హెచ్చరించాడు. సీరీస్ గెలవాంటే ఇంకా రెండు టెస్టులు ఆడాల్సి ఉందని మర్చిపోవద్దని హితవు చెప్పాడు.అయితే ప్రస్తుతం ఈసీస్ జట్టు బలహీనమైన […]

Continue Reading

హైదరాబాద్‌లో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు తీసిన కోతి

హైదరాబాద్: 2020 వెళుతూ వెళుతూ ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచేసింది. తన పని తాను చేసుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా ఉన్న యువకుడు.. కుటుంబ సభ్యుల ముందే కన్నుమూశాడు. కోతులను అదిలించబోయి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన నగరంలోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి జయనగర్‌లో కోతుల బెడత ఎక్కువైంది. కోతిని కొట్టబోయి విద్యుత్ షాక్‌తో సాప్ట్‌వేర్ ఉద్యోగి లోకేష్ మృతిచెందాడు. లోకేష్.. సాప్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లో […]

Continue Reading

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు…

సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ..అంతేనా పెద్ద స్టార్స్ కి కూడా..ఎందుకంటారా వారు నటించిన చిత్రాలను ఈ పెద్ద పండుగకు రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కరోనా అడ్డంకిగా మారింది కానీ లేకపోతేనా ఈ పాటి స్టార్ హీరోలందరి మూవీస్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యేవారు సినీ దర్శక..నిర్మాతలు. సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ సినిమాలకు బెస్ట్ సీజన్ కూడా. మరి ఈ సంక్రాంతికి ఏ ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయో తెలుసుకుందామా. గతేడాది సూపర్ స్టార్ మహేశ్ బాబు […]

Continue Reading

భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం.. పొరుగింటి వ్యక్తి దారుణ హత్య

ఓ వ్యక్తి తన పొరుగింటి వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశాడు. తన భార్యతో సెక్సువల్‌గా సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ సట్నా జిల్లాలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బమ్హంది గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన సజ్జు అనే వ్యక్తిని తన పొరుగింట్లో ఉంటున్న మహేష్‌ను తన ఇంటికి రావొద్దని కోరాడు. మహేష్ తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడనే […]

Continue Reading

వాస్తవ సంఘటనలతో ‘నల్లమల’

కొన్ని కథలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్‌తోనే రూపొందుతోన్న సినిమా ‘నల్లమల’.ఇప్పటికే సేవ్ నల్లమల అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు ఎన్నో పోరాటాలు నిరసనలు చేస్తున్నారు. అసలు నల్లమలకు ఏమైంది. ఆ అడవిని ధ్వంసం చేయాలని చూస్తున్నది ఎవరు.. వంటి విషయాలను చర్చిస్తూ.. అలాంటి అంశాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఓ గొప్ప వీరుని కథతో తెరకెక్కుతున్న సినిమా ‘నల్లమల’. నల్లమల నేపథ్యంలో రకరకాల పాయింట్స్ చుట్టూ ఇప్పటి వరకూ ఎన్నో […]

Continue Reading