నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్లు పునఃప్రారంభం

అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో మూతపడిన స్కూళ్ల రీ-ఓపెనింగ్‌కు ఏపీ విద్యాశాఖ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిశితంగా అన్ని విషయాలపై చర్చించిన అనంతరం స్కూళ్లు పున:ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. నవంబర్-02 నుంచి రాష్ట్రంలో స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయని జగన్ తెలిపారు. ఒక్క పూట మాత్రమే స్కూళ్లు ఉంటాయని సీఎం తెలిపారు. ఒంటిపూట బడులతో పాటు మధ్యాహ్న భోజన పథకం కూడా […]

Continue Reading

విధుల పట్ల నిర్లక్ష్యం.. గ్రామ సర్పంచ్ సస్పెన్షన్‌

రాజన్న సిరిసిల్ల : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా ఓ గ్రామ సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్ విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ సర్పంచ్ విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించడం అదేవిధంగా అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయడంలో విఫలమైన కారణంగా సర్పంచ్ కొక్కు సంధ్యరాణిని కలెక్టర్ కృష్ణ భాస్కర్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

Continue Reading

సెక్స్ చేస్తూ చనిపోయిన హీరో తండ్రి.. ఆత్మకథలో ఆసక్తికరమైన విషయాలు..

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఓ హీరో తండ్రి సెక్స్ చేస్తూ చనిపోయాడు. అసలు విషయం ఏంటంటే ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత మ్యాథ్యూ మెక్ కనాగే తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ఈయన ఆస్కార్ కూడా గెలుచుకుని హాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలిగిపోతున్నాడు. ఈ మధ్యే తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంగతులను పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. అందులో కొన్ని సంచలన విషయాలు […]

Continue Reading

కరోనా కేసుల రికవరీలో మనమే టాప్ : కేంద్ర ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ రోజువారీ రికవరీల సంఖ్య పెరుగుతున్నదని, దాంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నదని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. కరోనా కేసుల రికవరీల పరంగా భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నదని, కరోనా పరీక్షలపరంగా మాత్రం అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో […]

Continue Reading

డీజిల్ ట్యాంకర్ బోల్తా

విజయనగరం: జిల్లాలోని పి.కోనవలస దుర్గ గుడి దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడ్డ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డీజిల్ ట్యాంకర్ నుంచి లీకవుతున్న డీజిల్‌ను స్థానికులు తీసుకెళ్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  

Continue Reading

బాలుడి కిడ్నాప్..రూ. 45 లక్షలు ఇవ్వాలంటూ కాల్స్

హైదరాబాద్ : తెలంగాణలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది. మహబూబాబాద్‌కు చెందిన ఓ చానెల్‌ వీడియో జర్నలిస్టు కుసుమ రంజిత్ కుమారుడు దీక్షిత్‌ (9) ఆదివారం మిత్రులతో ఆడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిని కిడ్నాప్ చేశారు. సోమవారం రాత్రి వరకు బాలుడి గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 9.40 నిమిషాలకు ఫోన్ చేసిన కిడ్నాపర్లు మీ బాబు క్షేమంగా ఉండాలంటే రూ.45 లక్షలివ్వాలి.. రేపు […]

Continue Reading

కమల్నాథ్ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళను ఉద్దేశించి మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. అటువంటి భాషను తాను ఇష్టపడనని చెప్పారు. మధ్య ప్రదేశ్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆదివారం గ్వాలియర్‌లోని డాబ్రా పట్టణంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీ తరపున […]

Continue Reading

విశాఖ భూకుంభకోణం పై పని మొదలెట్టిన సిట్

గత ప్రభుత్వ హయాంలో విశాఖలో చోటుచేసుకున్న భూ కుంభ కోణాల మీద వైసీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ విచారణ మళ్లీ మొదలైంది. కరోనా వల్ల ఈ ఏడాది మార్చి నెల నుంచి ఈ విచారణ నిలిచి పోయింది. అయతే వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సిట్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ కుమార్‌ మొన్ననే విశాఖ చేరుకుని కమిటీతో భేటీ అయ్యారు. కోవిడ్ కారణంగా ‍ ఇన్నాళ్ళు నిలిచిపోయిన , విచారణ ఇప్పుడు ప్రారంభించామని, జిల్లా అధికారులు సిబ్బందితో […]

Continue Reading

రేపు ఇంద్రకీలాద్రికి జగన్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ రేపు బెజవాడ ఇంద్రకీలాద్రికి రానున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని జగన్‌ దర్శించుకోనున్నారు. మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారికి జగన్ పట్టు పస్త్రాలు సమర్పించబోతున్నారు. జగన్ రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఏటా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రులు బెజవాడ కనకదుర్గమ్మకు మూలా నక్షత్రం రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ రేపు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. […]

Continue Reading

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగేనా ?

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం కొలిక్కిరావడం లేదు. అధికారుల స్థాయిలో జరుపుతున్న చర్చలు వరుసగా విఫలమవుతున్నాయి. దసరా నవరాత్రులు ప్రారంభమైనా.. ఇప్పటికీ ఏపీ-తెలంగాణ మధ్య బస్సుల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ పడలేదు. దీంతో ప్రైవేటు బస్ యాజమాన్యాలు లాభాల పంట పండించుకుంటున్నాయి. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందనే సామెత తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఆర్టీసీ వివాదానికి సరిగ్గా సరిపోతుంది. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడపడంపై… రాష్ట్ర ప్రభుత్వాల మధ్య […]

Continue Reading