కర్నూలు మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో ఉల్లి ధరలు

కర్నూలు: భారీ వర్షాలకు ఉల్లి ఘాటెక్కింది. కర్నూలు మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది. క్వింటాల్ ఉల్లి రూ.4,850 ధర పలికింది. ఈ సీజన్‌లో ఇదే అధిక ధరగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో క్వింటా రూ.10 వేలు పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదలతో అధిక స్థాయిలో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో మార్కెట్ యార్డుకు గననీయంగా ఉల్లి దిగుబడులు తగ్గాయి. పది రోజుల క్రితం వరకు కేజీ రూ.30 కంటే […]

Continue Reading

ప్రైవేటు బస్సులో అగ్ని ప్రమాదం

విజయవాడ: నగర శివారులోని ప్రసాదంపాడు వద్ద జాతీయరహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి విజయవాడ వస్తున్న బస్సు ప్రసాదంపాడు సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌ ప్రయాణికులను దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న ఆటోనగర్‌ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు.. స్థానికుల సాయంతో బస్సును […]

Continue Reading

ఇల్లాలు, ప్రియురాలితో కలిసి చోరీలు

కర్నూలు నేరవిభాగం: కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన శిరువెళ్ల పరిధిలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం, ఎర్రగుంట్లలోని శ్రీకృష్ణ మందిరం, ఆళ్లగడ్డ పరిధిలోని బత్తలూరులో చెన్నకేశవస్వామి ఆలయాల చోరీల మిస్టరీకి తెరపడింది. అంతర్రాష్ట్ర దొంగ అనంతపురం జిల్లా పామిడికి చెందిన ఎరుకలి నల్లబోతుల నాగప్ప అలియాస్‌ రాజు అలియాస్‌ నాగరాజు (42) మహానంది మండలం గాజులపల్లికి చెందిన ఇతని ప్రియురాలు లావణ్య అలియాస్‌ సుధ (30), భార్య ప్రమీల (33)లను శనివారం అరెస్టు చేసిన పోలీసులు కడప జిల్లా […]

Continue Reading