కోతముక్క ఆడుతున్న పది మంది అరెస్టు

ఓ మహిళ ఇంట్లోనే కోత ముక్క నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి జూదరులను అరెస్టు చేశారు. సీఐ శోభన్‌బాబు కథనం ప్రకారం స్థానిక యాగంటి బహుళ అంతస్తుల భవనం ఎదురుగా నాగమల్లేశ్వరి అనే మహిళ తన ఇంట్లోనే కోత ముక్క ఆడిస్తున్నట్టు సమాచారం రాగా.. ఆ ఇంటిపై దాడిచేసి మరో మహిళతో పాటు 8 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.74,450 నగదు, 8 చరవాణులు, 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ […]

Continue Reading

జనవరి నుంచి రేషన్‌ డోర్‌ డెలివరీ

రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ విధానాన్ని నూతన సంవత్సరం నుంచి ప్రారంభించాలని పౌరసరఫరాలశాఖ భావిస్తోంది. ఈ ఏడాది డిసెంబరు నుంచే ఈ విధానాన్ని ప్రాంభిస్తామని గతంలో ప్రకటించినా, అవసరమైన వాహనాలు అందుబాటులోకి వచ్చేందుకు సుమారు 2నెలల సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో డోర్‌ డెలివరీ విధానాన్ని జనవరి నుంచి చేపట్టాలని యోచిస్తున్నారు. రేషన్‌ డోర్‌ డెలివరీకి వాహనాల టెండర్లు ఖరారయ్యాయి. టాటా మోటార్స్‌ సంస్థ ఒక్కో వాహనాన్ని రూ.5.72లక్షలకు టెండరు దక్కించుకుంది. మరోవైపు రేషన్‌ లబ్ధిదారులకు […]

Continue Reading

ఈఎస్‌ఐ స్కామ్‌లో మరో అరెస్టు

ఈఎ్‌సఐ స్కామ్‌లో దినేశ్‌ కుమార్‌ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన దినేశ్‌ ప్రొడిగి కంప్యూటర్స్‌ అండ్‌ ల్యాప్‌టాప్స్‌ సంస్థకు అధిపతి. 2017లో బయో మెట్రిక్‌ పరికరాల విక్రయాల్లో అప్పటి ఈఎ్‌సఐ డైరెక్టర్‌ రమేశ్‌ కుమార్‌తో కుమ్మక్కై రూ.53.67లక్షలు ప్రభుత్వానికి నష్టం చేకూర్చినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో దినేశ్‌ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా 29వరకూ జుడీషియల్‌ రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది.

Continue Reading

వార్డు సచివాలయాల్లో జగన్‌ పత్రికకే చాన్సు!

వైసీపీ సర్కారు బరితెగించింది. విచ్చలవిడిగా సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకుంటూ ప్రజల సొమ్మును దోచిపెట్టడమే గాకుండా.. సర్క్యులేషన్‌ను కూడా ప్రభుత్వ సాయంతోనే పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల గ్రామ/వార్డు సచివాలయాల్లో జగన్‌ పత్రిక మాత్రమే ఉండాలని నిర్ణయించడంతో పాటు అదే పత్రిక ప్రతులు రెండేసి పంపిణీ చేస్తోంది. ముందుగానే ఏడాది బిల్లును అడ్వాన్స్‌గా వసూలు చేస్తున్నారు. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 207 వార్డు సచివాలయాలకు రూ.4.14 లక్షల బిల్లు అడ్వాన్స్‌గా వసూలు చేశారు. ఇదే […]

Continue Reading

108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవం

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణి ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. పోచవరం కాలనీకి చెందిన గొంది సంగీత శుక్రవారం తెల్లవారుజామున పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు 108వాహనానికి సమాచారం అం దించారు. స్థానిక కోతుగుట్ట ఏరియాఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమై ఆమె మార్గమధ్యలోనే ప్రసవించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 108 సిబ్బంది రవికుమార్‌, రామ్మోహనరావు, అనిల్‌కుమార్‌లకు సంగీత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలి..

గుండాల : ఇంటింటి సర్వేను పంచాయతీ కార్యదర్శులు త్వరగా పూర్తిచేయాలని ఎంపీడీవో పుష్పలీల అన్నారు. శుక్రవారం మండలంలోని రామారం, మాసాన్‌పల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆస్తుల నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు సర్వేకు సహకరించాలని కోరారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Continue Reading

కోల్‎కతాపై ముంబై ఇండియన్స్ గెలుపు

అబుదాబి: ముంబై ఇండియన్స్‌ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్‎తో జరిగిన మ్యాచ్‎లో ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ తిరుగులేని జైత్రయాత్ర కొనసాగుతోంది. అయితే.. కోల్‎కతా టీమ్ నిర్ధేశించిన 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ముంబై టీమ్. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్, డికాక్ జట్టుకు వికెట్ కోల్పోకుండా మంచి ఆరంభాన్ని అందిచారు. ముంబై బ్యాటింగ్‎లో డికాక్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78) […]

Continue Reading

టీఆర్‌పీ కుంభకోణం కేసులో మరో వ్యక్తి అరెస్ట్

ముంబై: నకిలీ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్‌పీ) రాకెట్ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇవాళ మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై శివారు ప్రాంతం అంధేరీకి చెందిన నిందితుడు ఉమేశ్ మిశ్రా… విహారీ ప్రాంతంలో క్రైమ్ బ్రాంచ్ బృందానికి చిక్కినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రత్యేకించి పలానా న్యూస్ ఛానెల్ చూసే విధంగా వ్యూయర్షిప్ డేటాను సేకరించే మీటర్లు ఉన్న ఇంటి యజమానులకు లంచాలు ఇచ్చినట్టు మిశ్రా మీద ఆరోపణలు ఉన్నాయి. కాగా మిశ్రా […]

Continue Reading