చిరుత దాడిలో మహిళ మృతి…నెలరోజుల్లో ఐదుగురి మృతి

డెహ్రాడూన్(ఉత్తరాఖండ్): చిరుతపులి దాడి చేసిన ఘటనలో మరో మహిళ మృత్యువాత పడిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఫితోరాగడ్ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. గడ్డి తీసుకువచ్చేందుకు అడవుల్లోకి వెళ్లిన 40 ఏళ్ల మహిళపై చిరుతపులి దాడి చేసింది. బుధవారం సాయంత్రం చిరుత దాడిలో 40 ఏళ్ల మహిళ మరణించిందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వినయ్ భార్గవ చెప్పారు. గడ్డి కోస్తున్న మహిళపై ఓ చిరుతపులి దాడి చేసి నోట కరచుకొని 50 మీటర్ల దూరంలోని పొదల్లోకి లాక్కెళ్లింది. మహిళ అరుపులు […]

Continue Reading

నేడు నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌ : వాయుగుండం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం వర్షాలకు హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దయింది. భారీ వర్షానికి పోటెత్తిన వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కార్వాన్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, మెహదీపట్నం, సికింద్రాబాద్‌, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్‌, […]

Continue Reading

వరదలపై తెలంగాణ, ఏపీ సీఎంలతో మాట్లాడిన ప్రధాని

హైదరాబాద్‌ : తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో వానలు, వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి రెండు రాష్ట్రాల సీఎం కేసీఆర్‌, జగన్‌తో మాట్లాడారు. రెస్క్యూ, రిలీఫ్‌ వర్క్‌లో కేంద్రం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో వినాశనం కలిగించిన కుండపోత వర్షం కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌కూర్నూల్ జిల్లాలో […]

Continue Reading

ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా కరోనా కేసులు నమోదు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. అత్యల్పంగా 42 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,841కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 17 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 543 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 66 మంది డిశ్చార్జ్ అయ్యారు. 18 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం […]

Continue Reading

భర్త ఉండగానే భార్యకు వితంతు పింఛను

బదాయూ: యూపీలోని బాదాయూ జిల్లాలో బతికున్న భర్తను చనిపోయాడని చెబుతూ, కొంతమంది మహిళలు వితంతు పింఛన్లు పొందుతున్న ఉదంతం వెలుగు చూసింది. జిల్లాలో ఇలాంటి 106 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనిని గుర్తించిన అధికారులు తదుపరి చర్యలు చేపట్టడంతోపాటు ఇప్పటివరకూ ఈ విధంగా పింఛన్లు పొందినవారి నుంచి ఆ మొత్తాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొబెషన్ అధికారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 106 మంది మహిళలు తమ భర్తలు బతికి ఉన్నప్పటికీ, వారు చనిపోయారని […]

Continue Reading

గుంటూరులో ప్రైవేటు బస్సు బోల్తా

గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం దగ్గర ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారులు సీటులో ఇరుక్కుపోయారు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అద్దాలు పగులగొట్టి బయటకు తీశారు. బస్సు చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా… అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు

ఏపీ సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్ వేశారు. సీజేఐకి రాసిన లేఖలోని అంశాలను ప్రెస్‌ మీట్‌లో వెల్లడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ లేఖను విడుదల చేయడాన్ని తప్పుపడుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్‌ కేసులున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. మనీలాండరింగ్ కేసు కూడా నమోదైందని […]

Continue Reading

తిరుపతిలో దారుణం.. యువతిని రేప్ చేసిన పాస్టర్..!

తిరుపతిలోదారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతిపై ఓ పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు రేప్ చేశాడు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన బాధితురాలి తల్లి కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు దిశా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు స్పందన కార్యక్రమంలో అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయాల్సి […]

Continue Reading

ముంబైలో నేడు అతి భారీవర్షాలు..రెడ్ అలర్ట్

ముంబై : దేశఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో గురువారం అతిభారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలోని ముంబైతోపాటు థానే,పూణే, షోలాపూర్, ఉత్తర కొంకణ్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం ఉదయం హెచ్చరించారు. భారీవర్షాల వల్ల ముంబై నగరంలోని పలుప్రాంతాలు నీటమునిగాయి. పూణే జిల్లా నింగాన్ కేట్కీ గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్న 40మందిని సహాయ సిబ్బంది కాపాడారు. ఇందాపూర్ లో మరో […]

Continue Reading

40 ఏండ్లలో ఈ వర్షాన్ని చూడలేదు: కేటీఆర్

హైదరాబాద్‌లో ఇంత భారీ వర్షాన్ని 40 ఏండ్లలో తాను ఎప్పుడూ చూడలేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఆకాశానికి చిల్లు పడిందా?అన్నట్టుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసిందన్నారు. మంగళవారం రాత్రి 12 గంటల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వర్షాలు, వరదలపై సీఎస్‌, డీజీపీలతో సంప్రదించారని చెప్పారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు జీహెచ్‌ఎంసీ అధికారులు, హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించామన్నారు. మూసీనది ఉధృతంగా […]

Continue Reading