పురాతన ఇల్లు కూలి ఇద్దరు మృతి

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో ఆదివారం హైదరాబాద్‌ హుసేనిఆలంలోని ఓ పురాతన ఇల్లు కూలి ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆ పురాతన భవనంలో హాజి ముహమ్మద్‌ ఖాన్‌.. భార్య పర్వీన్‌ బేగం, కొడుకు, కోడలు, ఇద్దరు మనవళ్లు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. కింది పోర్షన్‌ను మూడు దుకాణాలకు అద్దెకిచ్చి పై పోర్షన్‌లో వీరుంటున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగా ఒక్కసారిగా పై పోర్షన్‌ కూలిపోయింది. […]

Continue Reading

ముంబై మళ్లీ మురిసె…

అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ టి20 టోర్నీలో దూసుకెళుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది. లీగ్‌లో 7 మ్యాచ్‌లాడిన రోహిత్‌ సేన ఐదో విజయంతో ‘టాప్‌’లోకి వచ్చింది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (52 బంతుల్లో 69 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ […]

Continue Reading

టూనీషియాలో పడవ మునిగి 12 మంది దుర్మరణం

టూనీషియా సముద్ర తీరంలో ఓ పడవ మునిగిన దుర్ఘటనలో 12 మంది మరణించారు. ఆఫ్రికా నుంచి అక్రమంగా పడవలో కొందరు వలసదారులు టూనీషియాకు వస్తుండగా వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆఫ్రికాలోని సబ్ సహరన్ నుంచి 30 మంది వలసదారులు పడవలో టూనీషియాకు వస్తుండగా సఫాక్స్ నగర సమీపంలోని సముద్ర తీరంలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలతో కలిపి 12 మంది వలసదారులు మరణించారు. సముద్రంలోనుంచి 11 మందిని వెలికితీశారు. ఏడుగురిని రక్షించారు. సముద్రంలో […]

Continue Reading

తెవాటియా, పరాగ్ మెరుపులు.. ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం

IPL 2020: ఐపీఎల్ టోర్నీలో ఇవాళ దుబయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో స్మిత్ సేన గెలుపొందింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్ మెరుపులతో రాజస్థాన్ జట్టు లక్ష్యాన్ని చేధించింది. ఆఖరి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠభరింతగా సాగింది. రాజస్థాన్ విజయానికి చివరి ఒవర్లో 8 పరుగులు అవసరం ఉండగా.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేశాడు. మొదటి నాలుగు బంతుల్లో 6 పరుగులు […]

Continue Reading

దేశంలో డిజిటల్‌ లావాదేవీల జోష్‌

ముంబై: డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా నగదురహిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆర్బీఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. గడిచిన ఐదేండ్లలో ఇండియాలో డిజిటల్‌ లావాదేవీలు అంతకుముందు కాలంతో పోల్చితే అనేక రెట్లు పెరిగాయని అందులో పేర్కొన్నది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి, 2019-2020 మధ్యలో డిజిటల్‌ లావాదేవీల్లో ప్రతీ ఏడాది సగటున 55 శాతం వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. 2016లో 593 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరగ్గా 2020నాటికి ఆ సంఖ్య […]

Continue Reading

మరోసారి చిక్కుల్లో కేరళ ముఖ్యమంత్రి..

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మరోమారు ఇరకాటంలో చిక్కుకున్నారు. గోల్డ్‌స్కామ్‌ నిందితురాలు స్వప్న సురేశ్‌ ఎవరో తనకు తెలియదని, ఔట్‌సోర్సింగ్‌లో నియమితులయ్యే వారి వివరాలు అధికారులకూ గుర్తుండదని ఆయన గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల విచారణలో ”ముఖ్యమంత్రి విజయన్‌కు నా నియామకం గురించి తెలుసు. ఆయన నన్ను బాగా గుర్తుపడతారు. అప్పటి ఐటీ శాఖ కార్యదర్శి ఎం.శివశంకర్‌కు నేను బాగా తెలుసు” అంటూ స్వప్న వాంగ్మూలమిచ్చింది. ఆ మేరకు ఈడీ […]

Continue Reading

ఎంపీలో పది రోజుల క్రితం మెడికో ఆత్మహత్య

భోపాల్‌ : దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ప్రజల్లో అవగాహన కల్పించినా.. కులవివక్ష జాఢ్యం తగ్గడం లేదు. భావి భారతదేశ పౌరులను తీర్చి దిద్దే విద్యాసంస్థల్లోనూ ఈ రక్కసి పడకేసింది. మధ్యప్రదేశ్‌లో ఓ వైద్యవిద్యార్థి కులవివక్ష, ర్యాగింగ్‌ భూతానికి బలయ్యాడు. ఈనెల 1న తాను చదువుతున్న జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు భగవత్‌ దేవగన్‌ (28) ఉరేసుకొని చనిపోయాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే, ఈ విషయంలో బాధితుడి కుటుంబానికి న్యాయం […]

Continue Reading

ఔటర్‌ సరసన మరిన్ని సౌలత్‌లు

నగరానికి తలమానికంగా ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పరిసరాల రూపురేఖలు మారనున్నాయి. మరిన్ని వసతులు ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్న హెచ్‌ఎండీఏ అధికారులు పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో (పీపీపీ) అధునాతన సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. రింగు రోడ్డులోని ఇంటర్‌చేంజ్‌ల వద్ద గల ఖాళీ స్థలాల్లో పది నుంచి ఇరవై ఎకరాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రెస్ట్‌ అండ్‌ రిలాక్స్‌ సెంటర్లు, ఫ్యూయల్‌ స్టేషన్లు, షాపింగ్‌, పార్కింగ్‌, పిల్లలకు క్రీడా మైదానాలను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే ఔత్సాహిక […]

Continue Reading

పదేండ్ల రికార్డు.. తడిసిముద్దయిన హైదరాబాద్‌

వాతావరణ శాఖ అధికారి రాజారావునగరంలో ఈసారి కురిసిన వానలకు పదేండ్ల రికార్డు కొట్టుకుపోయింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురిసిన వర్షాలతో సిటీ తడిసి ముద్దయింది. 2010లో 14సెంటీమీటర్ల వర్షం పడగా, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే.. ఈ నెల 9న ఆసిఫ్‌నగర్‌ మండల పరిధిలో 15.1సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా శేరిలింగంపల్లి, పటాన్‌చెరులో 6సెం.మీకి పైగా వర్షం కురిసింది. బంగాళాఖాతంలోఏర్పడిన వాయుగుండానికి తోడు ఉత్తర కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణుల ప్రభావం వల్ల […]

Continue Reading

సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర

బాలాజీనగర్‌ డివిజన్‌ పరిధిలొని పలు సమస్యలపై ఆదివారం బిజేపి పోరుబాట కార్యక్రమం చేపట్టారు. మేడ్చల్‌ జిల్లా అర్బన్‌ బిజేపి అధ్యక్షులు పన్నాల హరిష్‌రెడ్డి పిలుపు మేరకు డివిజన్‌ అధ్యక్షులు వినోద్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహిం చారు. ఈ సందర్భంగా కెపిహెచ్‌బి రోడ్డు నంబర్‌ 1లోని జీహెచ్‌ఎంసి పార్కు వినియోగానికి కాలనీ వాసుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్న అధికారులను నిలదీశారు. వెంటనే అక్రమ వసూళ్ళను నిలిపివేయాలని, పార్కు సమయాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ […]

Continue Reading