ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరం రోడ్డు ప్రమాదం

హైదరాబద్: శుక్రవారం తెల్లవారు జామున ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి అంజయ్యనగర్‌కు చెందిన మహ్మద్‌ లస్కర్‌ ఆలీ, అతని స్నేహితుడు ముక్తార్‌ హుస్సేన్‌, ఆయన భార్య ఫిర్రోజ్‌ బేగం, లస్కర్‌ చిన్నకూతురు కలిసి బంధువులైన సాబేర్‌ హైమద్‌, రెహమాన్‌లను తన జైలో కారులో ఎక్కించుకొని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మూడున్నర గంటలకు సెండాఫ్‌ చేసి తిరిగి ప్రయాణం అయ్యారు. వీరు నాలుగు గంటల సమయంలో […]

Continue Reading

క్యాన్సర్ అవేర్‌నెస్ నెలగా అక్టోబర్: ఏపీ డీజీపీ

విజయవాడ: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ వర్చ్యువల్ రన్ 2020ను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది చాలా ఉపయుక్తమైన రన్ అని.. శారీరక ధృఢత్వానికి చాలా అవసరమని పేర్కొన్నారు. క్యాన్సర్‌ గురించి అవగాహన చాలా అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క్యాన్సర్‌ను ప్రారంభ స్ధాయిలోనే గుర్తించాలని తెలిపారు. క్యాన్సర్‌ అవేర్‌నెస్ నెలగా అక్టోబర్ ఉంటుందని అన్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఎక్కువ మంది ఈ రన్‌లో పాల్గొనడం ద్వారా గిన్నీస్ […]

Continue Reading

నేడు టీటీడీ ఈఓగా బాద్యతలు స్వీకరించనున్న జవహర్ రెడ్డి

టీటీడీ ఈవోగా నేడు జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు కాలినడకన తిరుమల చేరుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో మధ్యాహ్నం 12.30 నిమిషాలకు టీటీడీ ఈవోగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులతో జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు స్వామివారికి ఇష్టం అయిన రోజు కావడంతో ఈరోజే తిరుమల ఆలయంలో టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఆయన వైద్య ఆరోగ్యశాఖ నుండి […]

Continue Reading

ఐపీఎల్‌ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ మరో గ్రాండ్ విక్టరీ

నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 46 పరుగుల తేడాతో మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ టీమ్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో రాజస్థాన్ తేలి పోయింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్ బట్లర్‌ ను ఔట్ చేసి అశ్విన్ ఆదిలోనే షాకిచ్చాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ స్మిత్, ఓపెనర్ జై శ్వాల్‌ తో కలిసి ఇన్నింగ్స్ చక్క దిద్దుతూ […]

Continue Reading

సీవీ ఆనంద్‌ ధ్వన్యనుకరణతో మోసం

పోలీసు ఉన్నతాధికారి సీవీ ఆనంద్‌ ధ్వనిని అనుకరిస్తూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఠా సభ్యుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలతో పాటు రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లా ఏఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడకు చెందిన ప్రధాన నిందితుడు అక్కపల్లి చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు, గండీడ్‌ మండలం నంచర్లకు చెందిన […]

Continue Reading

రాష్ట్రంలో కొవిడ్‌ తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే.. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 తీవ్రత ఏపీలో తగ్గిపోతుండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించడం కాస్త ఊరటనిస్తోంది. అంతేగాక కొవిడ్ పాజిటివిటీ, మరణాల రేట్లు కూడా గణనీయంగా తగ్గాయని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. రికవరీ రేటు భారీగా పెరిగిందని, అన్ని జిల్లాల్లో మరణాలు తగ్గాయని వెల్లడించారు. కొవిడ్‌-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన […]

Continue Reading

మంత్రాల నెపంతో ముగ్గురు మహిళలపై దాడి చేసి నగ్నంగా ఊరేంగించారు

మంత్రాల నెపంతో కొందరు వ్యక్తులు దారుణానికి ఓడిగట్టారు. దాదాపు 50 మంది కలిసి ముగ్గురు మహిళలు, ఓ పురుషుడిపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డారు. వారి బట్టలూడదీసి.. ఊరిలో నగ్నంగా తిప్పారు. అడ్డుకోవాలని చూసినవారిని తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లా నారాయణ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. నారాయణ్‌పూర్ గ్రామానికే చెందిన బలి […]

Continue Reading

అజ్ఞాతంలోకి ఎస్‌ఐ.. కారణమిదేనా?

గుంటూరు: నగరంపాలెం ఎస్‌ఐ జి.ప్రభాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఐదురోజులుగా ఆయన విధులకు గైర్హాజరవుతున్నారు. తప్పుడు ఎన్‌సీసీ సర్టిఫికెట్‌తో ఆయన ఉద్యోగం సంపాదించినట్లు తేలడమే కాక ఆయనపై ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పల్నాడు ప్రాంతానికి చెందిన జి.ప్రభాకర్‌రెడ్డి గతంలో ఫైర్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అయితే 2014లో ఆయన ఏలూరు రేంజ్‌ నుంచి ఎస్‌ఐగా దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే ఆయన వయసు రెండేళ్ళు ఎక్కువగా ఉంది. దీంతో దరఖాస్తును పక్కనపడేశారు. […]

Continue Reading

విజయవాడ వాసుల అవస్థలు

విజయవాడ నగరాన్ని శుక్రవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు గంట పాటు కురిసిన వానకు జనజీవనం అస్తవ్యస్తం కాగా, ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బందరు, ఏలూరు, పిన్నమనేని పాలీక్లినిక్‌, డీవీ మేనర్‌, టిక్కిల్‌, ఏఎస్‌ రామారావు, నిర్మలా కాన్వెంట్‌ రోడ్లలో రెండడుగుల లోతున నిలిచిన వాన నీటికి మురుగునీరు తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనకదుర్గ వారధి మీదుగా సాగే జాతీయ రహదారిపై అంబులెన్స్‌ ఇరుక్కుపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోకి […]

Continue Reading

రంజీ మాజీ క్రికెటర్ సురేష్ కుమార్ ఆత్మహత్య

తిరువనంతపురం (కేరళ): కేరళ రాష్ట్రానికి చెందిన రంజీ ట్రోఫీ మాజీ క్రికెటర్ ఎం సురేష్ కుమార్(47) శుక్రవారం రాత్రి తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. తన తండ్రి సురేష్ కుమార్ పడకగదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీతో పోలీసులు హుటాహుటిన వచ్చి సురేష్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.అల్లప్పుజా నగరానికి చెందిన సురేష్ కుమార్ 1991 నుంచి 2006 వ సంవత్సరం వరకు […]

Continue Reading