‘ఔటర్’పై ఢీకొన్న కార్లు.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై రెండుకార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న కారు ఈరోజు ఉదయం నార్సింగి ఔటర్ రింగ్‌రోడ్డు బ్రిడ్జి కింద మరో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని దవాఖానకు తరలించారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు సూర్యాపేటకు చెందినవారిగా గుర్తించారు.

Continue Reading

ముగ్గురి అఘాయిత్యం…గర్భం దాల్చిన 12 ఏళ్ల బాలిక

సూరత్ (గుజరాత్): యూపీలోని హాథ్రస్ ఘటన మరవక ముందే గుజరాత్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని నవసరి జిల్లాలో వ్యవసాయ కూలీ కుమార్తె అయిన 12 ఏళ్ల బాలికపై తన ముగ్గురు దాయాదులైన బాలురు గడచిన ఐదు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. దీంతో 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఆమె బంధువుల్లో ఓ బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం విషయాన్ని మరో ఇద్దరు దాయాదులకు […]

Continue Reading

హుజూరాబాద్లో భారీ అగ్నిప్రమాదం

కరీంనగర్‌: జిల్లాలోని హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలు ఉంచిన గదిలో మంటలు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం వల్ల రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు ప్రాజెక్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిసమాచారం తెలియాల్సి ఉన్నది.

Continue Reading

నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్

హైదరాబాద్: దళిత యువకుడి శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత నూతన్ నాయుడు భార్య మధుప్రియను పోలీసులు మరోమారు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో తమ నుంచి రూ. 25 లక్షలు వసూలు చేశారంటూ తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుప్రియ బెయిలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. తన ఇంట్లో పనిచేసి […]

Continue Reading

భర్త వేధింపులు తాళలేక.. ప్రియుడితో కలిసి చంపిన భార్య

మద్యం మత్తులో భర్త వికృత చేష్టలు.. కుమారులకు ఎవరూ పిల్లలనిచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిందో వివాహిత. స్థానికుల అనుమానంతో పోలీసులు రంగంలోకి దిగడంతో గుట్టురట్టయింది. ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు, అదనపు సీఐ కె.జంగయ్య వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మండలం ఎన్‌ఎఫ్‌సీనగర్‌కు చెందిన దర్జీ గంగాపురం అంజయ్య(57), భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహారాష్ట్రలో, చిన్న కుమారుడు స్థానికంగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. మద్యం మత్తులో అంజయ్య భార్య, […]

Continue Reading

నేడు నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్

నిజామాబాద్‌: శాసన మండలి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఫలితాలు ఏకపక్షంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప.. ఈ ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే […]

Continue Reading

‘ఆమె’ వస్తే .. మరిన్ని విషయాలు వెలుగులోకి!

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో పట్టుబడిన ఏసీపీ నర్సింహారెడ్డి.. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. సోదాల్లో పట్టుబడిన, ఇతర దర్యాప్తులో సేకరించిన పత్రాలు, ఆధారాలను ముందుంచి ప్రశ్నించినా ఏసీపీ నుంచి ఆశించిన మేర సమాధానాలు రాలేదని సమాచారం. రూటు మార్చిన ఏసీబీ అధికారులు మరో పంథాలో కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పట్టుబడిన ఆస్తుల్లో నర్సింహారెడ్డి బినామీలుగా గుర్తించిన వారిగురించి ఆరా తీస్తున్నారు. మాదాపూర్‌ భూకొనుగోలులో […]

Continue Reading

పంజాబ్‌ ను చిత్తుగా ఓడించిన హైదరాబాద్

పంజాబ్‌ కింగ్స్‌ను హైదరాబాద్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. పంజాబ్‌ కింగ్స్ మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. రెండో ఓవర్లోనే మయాంక్‌ , ఐదో ఓవర్లో సిమ్రన్‌ సింగ్‌ .. ఔట్ అయ్యారు. మరి కాసేపటికే కేఎల్‌ రాహుల్‌ కూడా వెనుదిరిగాడు. 58 పరుగులకే 3 వికెట్ల కోల్పోవడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ సమయంలోనే […]

Continue Reading

తెలుగు రాష్ట్రాలకి భారీ వర్ష సూచన.. బీ అలెర్ట్ !

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఒడిశా మీదుగా ద్రోణి ఉంది. అలాగే, తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటితో పాటు బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా మారొచ్చంటున్నారు నిపుణులు. వీటన్నింటి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడొచ్చని […]

Continue Reading

PNB బ్యాంకు ఎండీ, సీఈవో ఢిల్లీలో జగన్‌ను కలిశారు.. రఘురామ సంచలనం

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు డైరెక్టర్‌గా ఉన్న ఇండ్‌-భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. 826 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కన్సార్షియమ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 10 మంది డైరెక్టర్లపై కేసు పెట్టింది. హైదరాబాద్‌, ముంబైతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో గురువారం ఏకకాలంలో 11చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్‌ నేషనల్‌ […]

Continue Reading