ఢిల్లీ గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని భర్తాల్ గ్రామంలోని సెక్టారు-26లోని గోదాములో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా తెలియలేదు. గోదాములో రేగిన మంటలను 13 అగ్నిమాపక వాహనాలు వచ్చి ఆర్పాయి. మంటలను అదుపుచేశామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఎంకే చటోపాధ్యాయ చెప్పారు.

Continue Reading

ఐదు గంటల్లో ఆట కట్టించారు

డబ్బులు ఇవ్వడం లేదని ఓ మొక్కజొన్నల వ్యాపారిని కిడ్నాప్‌ చేయగా వెంటనే పోలీసులు సినీఫక్కీలో కేసును ఛేజ్‌ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి వ్యాపారిని కాపాడారు. సరూర్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. గ్రీన్‌పార్కు కాలనీలో నివాసముండే నాగభూషణం శివబాలాజీ ట్రేడర్స్‌ పేరుతో మొక్కజొన్నల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో రైతుల నుంచి మొక్కజొన్నలు తీసుకువచ్చి పౌల్ట్రీ ఫాంలకు సరఫరా చేస్తుంటాడు. కాగా లాక్‌డౌన్‌కు ముందు కోరుట్ల ప్రాంతానికి చెందిన ట్రేడర్‌ రాజ్‌భూషన్‌ ద్వారా రైతుల వద్ద […]

Continue Reading

హత్య చేసి.. ఆత్మహత్య అంటున్నారయ్యా..

తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నీ తామై.. స్వాతికి వివాహం చేశాం. రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, మా అమ్మాయిని హత్యచేశాడు. కానీ ఆత్మహత్య అని చెబుతున్నారు. నిందితులకు శిక్ష పడాల్సిందే..’ అంటూ దేవినగర్‌లో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వడ్డే స్వాతి(24) బంధువులు ఆరోపించారు. సోమవారం అజిత్‌సింగ్‌నగర్‌ సీఐ లక్ష్మీనారాయణను కలిసి స్వాతి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన సమాచారం మేరకు.. కర్నూలు టౌన్‌కు చెందిన […]

Continue Reading

మరొక్క ఛాన్స్ ఇవ్వండి..: బీజేపీ నేత

హైదరాబాద్ : మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, ప్రజా సమస్యలపై పెద్ద సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవకాశం కల్పించాలని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కోరారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీగా పెద్దల సభలో వందకు వందశాతం సభకు హాజరై.. సమస్యలపై చర్చించింది తానేనని పేర్కొన్నారు.

Continue Reading

ఏపీలో ఇక వర్షాలే వర్షాలు…

విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, ఒడిసా తీర ప్రాం తాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్‌ గఢ్‌, ఉత్తర మహారాష్ట్ర తీరం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. తూర్పు బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. వీటి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షి ణ కోస్తా, సీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న […]

Continue Reading

నేటి నుంచి శిల్పారామాల్లోకి సందర్శకులకు అనుమతి

అమరావతి: తిరుపతిలోని శిల్పారామాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేయడంతోపాటు.. శ్రీకాకుళంలో కొత్తగా శిల్పారామం ఏర్పాటుకు తొలిదశలో రూ.3 కోట్లు కేటాయించినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇక రాష్ట్రంలోని శిల్పారామాల్లోకి మంగళవారం నుంచి సందర్శకులను అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. కానీ, ఫిల్మ్స్‌ ప్రదర్శనలు, వినోద క్రీడలకు అనుమతి లేదని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Continue Reading

రైతు సంక్షేమానికే మా తొలి ప్రాధాన్యత

అమరావతి: దేశంలో ఎవరూ చేయని విధంగా ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఒక్క మంచి ముక్క రాయడానికి మనసొప్పని ఈనాడు, తదితర మీడియా సంస్థలు పనిగట్టుకుని.. మైక్రోస్కోపులు పెట్టి మరీ లోపాలను వెతికే పనిలో పడ్డాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. రైతు సంక్షేమానికే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. కోవిడ్‌–19 వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నిధులకు వెరవకుండా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. 16 […]

Continue Reading

చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి

అమరావతి: ‘ప్రభుత్వానికి కాకుండా డీజీపీ వంటి అధికారులకు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలు రాయడమేంటి? లిటిగెంట్‌ మనస్తత్వంతోనే ఆయన ఇలా చేస్తున్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు

Continue Reading

పార్క్ స్థలం కాపాడాలని మంత్రి కేటీఆర్ కి వినతి

ఎల్బీనగర్‌ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్‌ పరిధిలో ని జనప్రియ కాలనీ లొని సర్వే నెంబర్‌ 49/2, 49/3 గల ల్యాండ్ను కొందరు కబ్జా దారులు ఆక్ర మించి నిర్మాణాలు చేపడుతున్నారు అని జనప్రియ కాలనీ సెక్రటరీ, సభ్యులు మున్సిపల్‌ శాఖామంత్రి కేటీఆర్‌ కి సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా జనప్రియ కాలనీ సెక్రటరీ, సభ్యులు మాట్లాడుతూ 4 ఎకరాల 10 గుంటల స్థలం లో తుల్జాసింగు అనే బిల్డర్‌ 80 ప్లాట్స్‌ చేసి విక్రయించాడు. మిగితా […]

Continue Reading

రెండు వేర్వేరు చోట్ల క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న రెండు ముఠాల అరెస్టు

నగరంలో భూకీలు అడ్డా వేశారు. నగరాన్ని సేఫ్‌జోన్‌గా మార్చకుని ఆన్‌లైన్‌లో క్రికెట్‌బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. నగరంలో వేర్వేరు చోట్ల క్రికెట్‌బెట్టింగ్‌లకు ప్పాడుతున్న రెండు ముఠాలకు చెందిన ఆరుగురు సభ్యులను సెంట్రల్‌జోన్‌, సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీసీపీ రాధాకిన్‌రావు తెలిపిన వివరాల మేరకు రెండ్‌హిల్స్‌కు చెందిన మహేస్‌ ప్రసాద్‌ తివారీ నీలోఫర్‌ కేఫ్‌ వద్ద కిరాణ జనరల్‌ స్టోర్‌ను నడిపిస్తున్నారు. జల్సాలకు అలవాటైన నిందితుడు ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహించాలని పథకం వేశాడు. స్నేహితులు, తెలిసిన వారితో […]

Continue Reading