ఆశచూపి.. 4 లక్షలు దోచేశారు

హైదరాబాద్‌: అప్పులు గంపెడయ్యాయి. వేరే దారిలేక కిడ్నీ అమ్మేసి అప్పులు తీర్చాలనుకున్నాడు. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోయాడు. నాగోల్‌ ఆనంద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. సులువుగా డబ్బు సంపాదించే మార్గాల కోసం ఆన్‌లైన్‌లో శోధించాడు. కిడ్నీ వితరణ ద్వారా భారీగా డబ్బు సంపాదించవచ్చని ఒక ప్రకటన కంటబడింది. ఒక్క కిడ్నీకి రూ.3 కోట్లు ఇస్తామని దానిలో ఉంది. తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమంటూ అందులోని వాట్సాప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేశాడు. […]

Continue Reading

దిగ్గజ విశ్లేషకుడి కార్యాలయాన్ని కూల్చుతున్న జీవీఎంసీ అధికారులు

విశాఖలో టీడీపీ నేత సబ్బం హరి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీతమ్మధారలో సబ్బం హరి ఇంటి వద్ద ఉన్న కార్యాలయాన్ని జీవీఎంసీ తొలగించారు. ఇంటిని ఆనుకుని ఉన్న టాయిలెట్‌ను కూల్చుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చడంపై సబ్బం హరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కూల్చుతున్నారో అధికారులు చెప్పడం లేదని అన్నారు. కూల్చివేతకు కారణాల్ని ఓ కాగితంపై రాసివ్వాలంటే… స్పందించడం లేదని తెలిపారు.

Continue Reading

5న ‘కృష్ణా’లో జగనన్న విద్యాకానుక ప్రారంభం

కంకిపాడు: జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 5న సీఎం వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా కంకిపాడు జెడ్పీ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. అక్కడ ఎంపీపీ ఆదర్శ పాఠశాలలో నాడు–నేడు పనులను సీఎం పరిశీలిస్తారన్నారు. శుక్రవారం కంకిపాడు, కోలవెన్నుల్లో ఎంపీపీ ఆదర్శ పాఠశాలలు, పునాదిపాడులో జెడ్పీ పాఠశాలల్లో జరుగుతున్న ‘నాడు–నేడు’ పనులను మంత్రి సురేశ్‌ పరిశీలించారు.

Continue Reading

‘వైసీపీలోకి రావాలంటే ముందు ఆ పని చేయాలి’

విశాఖపట్నం: వైసీపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, ఎవరైనా ఎమ్మెల్యే తమ పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేసి రావలసి ఉంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారమిక్కడ జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీలో చేరేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉన్నారన్నారన్నారు. అయితే తమ పార్టీ సిద్ధాంతాలను పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

Continue Reading

‘మళ్లీ కాంగ్రెస్‌లో చేరతా..’

రాజమహేంద్రవరం: ‘నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక చేసిన పోరాటం చూస్తుంటే ఇందిరాగాంధీ రోజులు గుర్తుకొస్తున్నాయి. దేశంలో పేద, దళిత, మైనారిటీ ప్రజలకు అండగా ఉండేది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్‌ ఒక్కటే’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హీరోలా 120 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లడానికి నిర్ణయించుకున్న రాహుల్‌ను పోలీసులు అడ్డుకున్న […]

Continue Reading

కామాంధునికి 600 ఏళ్ల జైలుశిక్ష

అభం శుభం తెలియని చిన్నారులను లైంగిక చర్యలకు ప్రోత్సహించి, ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న నేరానికి మ్యాథ్యూ టైలర్‌ మిల్లర్‌ (32) అనే నిందితునికి 600 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం అమెరికా డిస్ట్రిక్ట్‌ జడ్జి స్కాట్‌ కూగ్లర్‌ తీర్పు చెప్పారు. కాటన్‌డేల్‌కు చెందిన నిందితునిపై పలు లైంగిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి జానీ షార్ప్‌ జూనియర్‌ మాట్లాడుతూ.. నిందితుని వికృత చర్యల వల్ల ఆ చిన్నారుల బాల్యం దోపిడీకి గురైందన్నారు. 2014 […]

Continue Reading

ఏపీ సీఎం జగన్ ఇంట విషాదం… వైఎస్ భారతి తండ్రి కన్నుమూత

Andhra Pradesh: ప్రముఖ డాక్టర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయానా మామ ఈసీ చిన్న గంగిరెడ్డి కన్నుమూశారు. చిన్న గంగిరెడ్డి జగన్ సతీమణి భారతి తండ్రి అన్న విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పులివెందులలో పేదల డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈసీ గంగిరెడ్డి మరణంతో సీఎం జగన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈమధ్యే సీఎం జగన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి […]

Continue Reading

యువతి దారుణ హత్య

ర్తుతెలియని యువతి దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి మండల పరిధిలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. కోట్‌పల్లి మండలం అన్నసాగర్‌ గ్రామం నుంచి కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు వెళ్లే దారిలో గుడి వద్ద ఓ సంచిలో యువతి మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. యువతి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Continue Reading

రైజర్స్‌ అదరగొట్టారు

వావ్‌.. సన్‌రైజర్స్‌. 69 పరుగులకే వార్నర్‌, బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే, విలియమ్సన్‌ అవుటైన వేళ.. 150 పరుగులే అసాధ్యమనిపించింది.. కానీ మిడిలార్డర్‌ బలహీనతను అధిగమిస్తూ.. అందివచ్చిన అవకాశాన్ని సొంతం చేసుకుంటూ యువ ఆటగాళ్లు ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ వర్మ రెచ్చిపోయారు. దీంతో జట్టు ఏకంగా 164 పరుగులను స్కోరుబోర్డుపై ఉంచి చెన్నైకి సవాల్‌ విసిరింది.. అటు సీఎ్‌సకేకు వారం రోజుల విశ్రాంతి కూడా సరిపోనట్టుంది. ఆరంభం నుంచే తడబడుతూ ఒత్తిడిలో పడిపోయింది. ధోనీ చివరి దాకా ఉన్నా […]

Continue Reading

టీ20ల్లో ధోనీ రికార్డు

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌ (194)లు ఆడిన ఆటగాడిగా చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ టీ20 లీగ్‌ల్లోనైనా ఓ క్రికెటర్‌ ఇన్ని మ్యాచ్‌లు ఆడడం ఇదే ప్రథమం. ఈ క్రమంలో అతను సురేశ్‌ రైనా (193)ను అధిగమించాడు. రోహిత్‌ (192) మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు సీఎ్‌సకే తరఫున అత్యధిక మ్యాచ్‌ (164)లు ఆడిన ఆటగాడిగానూ రైనా సరసన ఎంఎస్‌ చేరాడు.

Continue Reading