నంద్యాలలో దారుణం.. నిండి గర్బిణిని కత్తితో పొడిచి చంపిన మరో మహిళ

తండ్రి వివాహేతర సంబంధం పెట్టకున్న మహిళను నిలదీసిన ఓ నిండు గర్భిణి హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన బుధవారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని వైఎస్సార్ నగర్‌లో చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం… వైఎస్సార్ నగర్ చెందిన వెంకటరాముడు, భారతి దంపతులు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దురు కూతుళ్లు కాగా, పెద్ద కూతురును భీమరం గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. రెండో కూతురు లక్ష్మిదేవికి రెండేళ్ల కిందట మునిస్వామితో వివాహం […]

Continue Reading

గుట్కా వ్యాపారి అరెస్టు.. రూ.2.39 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

కర్నాటక రాష్ట్రం బీదర్‌ నుంచి నగరానికి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తీసుకువస్తున్న ఓ వ్యాపారిని బుధవారం సైబరాబాద్‌ మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.2.39 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను, కారును స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన షాహీద్‌ మహ్మద్‌ అధిక మొత్తంలో డబ్బులు సంపాదించడానికి బీదర్‌ నుంచి గుట్కాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం కారులో బీదర్‌కు వెళ్లి తీసుకెళ్త్తుండగా ఖాజాగూడ మల్కంచెరువు వద్ద ఎస్‌ఓటీ పోలీసులు […]

Continue Reading

తీవ్ర ఒత్తిడికి లోనై యువకుడి ఆత్మహత్య

ఆరోగ్య పరిస్థితులు బాగాలేక తీవ్ర ఒత్తిడికి లోనైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం జాన్సీకి చెందిన విజయ్‌సింగ్‌(25) రెండు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి మార్బుల్‌ పాలిషింగ్‌ పనులు చేసుకుంటూ బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద ఉన్న నందమూరినగర్‌ బస్తీలో నివాసముంటున్నాడు. విజయ్‌సింగ్‌తో పాటు రూమ్‌లో ఉండే మరో ఇద్దరు యువకులు ఈ నెల 29న పనులకు వెళ్లి రాత్రి ఇంటికి […]

Continue Reading

మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ

మియాపూర్‌: రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలని, ఇందుకోసం కాలనీ సంఘాలు, పార్టీ ప్రతినిధులు తగిన కృషి చేయాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌ డివిజన్‌లోని విశ్వనాథ గార్డెన్స్‌లో పట్టభద్రుల ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మేయర్‌ బొంతు , ప్రభుత్వ విప్‌ గాంధీలు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న […]

Continue Reading

మోడీ సర్కార్ నిర్లక్ష్యంపై నిలేద్దాం..

నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు అక్టోబరు ఆరున నిర్వహించబోయే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిలేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. ఏడేండ్ల అలసత్వంపై మోడీ సర్కార్‌ను ఎండగడతామని తెలిపారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో అనుసరిం చాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బుధవారం హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో సీఎం.. నీటి పారుదలశాఖ ఉన్నతా ధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ… ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. […]

Continue Reading

మరిన్ని సడలింపులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ అన్‌లాక్‌ 5.0 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరిన్ని మినహాయింపులిచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్‌లాక్‌5.0 మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు 50శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది. అక్టోబర్‌ 15నుంచి స్కూళ్లు తెరుచు కోవచ్చని, ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకు విడిచిపెడుతున్నామని పేర్కొంది. 15 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూఎగ్జిబిషన్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు తెరుచుకో నేందుకు […]

Continue Reading

ఫోన్పేలో 5 లక్షల పాలసీల విక్రయం

న్యూఢిల్లీ : డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ఫోన్‌పేలో గడిచిన ఏప్రిల్‌-ఆగస్టు మధ్య కాలంలో 5 లక్షలకు పైగా బీమా పాలసీలు విక్రయించినట్లు ఆ సంస్థ తెలిపింది. తమ యాప్‌లో బీమా విభాగాన్ని ప్రవేశపెట్టిన తొమ్మిది మాసాల్లోనే అత్యంత వేగంగా ఈ స్థాయి వద్ధిని సాధించినట్లు వెల్లడించింది. ప్రథమ, ద్వితీయ, తతీయ శ్రేణి నగరాలలోని 15వేలకు పైగా పిన్‌ కోడ్‌ల నుంచి బీమా కొనుగోళ్లు జరిగినట్టు పేర్కొంది. బీమా టెక్‌ పరిశ్రమలో ఇదే అత్యంత వేగవంతమైన వద్థి అని ఫోన్‌పే […]

Continue Reading

హోండా నుంచి లగ్జరీ బైక్

న్యూఢిల్లీ : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కు పోటీగా హోండా మోటార్స్‌ భారత్‌ లో లగ్జరీ బైకులను ఆవిష్కరించింది. బుధవారం హెచ్‌నెస్‌ సీబీ350 పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.1.90 లక్షలుగా ఉండొచ్చని అంచనా. ఈ కొత్త బైక్‌ 400 సీసీ సెగ్మెంట్‌కి చెందినది కావడం వల్ల క్లాసిక్‌ సిరీస్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌కి పోటీగా నిలుస్తుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని సింగిల్‌ సీట్‌తో తయారుచేసిన కంపెనీ వెనక సీటును ఆప్షనల్‌గా చేసింది. వినియోగదారులు […]

Continue Reading

డిజిటల్ ప్రకటనల జోరు

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిటల్‌ ప్రకటనల విలువ టివి యాడ్స్‌ను మించి పోనున్నాయని సర్వీసెస్‌ నెట్‌వర్క్‌ కేపీఎంజీ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. టెలివిజన్‌ లాంటి సాంప్రదాయ మీడియా ప్రకటనలు 17 శాతం పడిపోయి రూ.21,700 కోట్లకు పరిమితం కానున్నాయని అంచనా వేసింది. ఇదే సమయంలో డిజిటల్‌ మీడియా ప్రకటనలు రూ.22,300 కోట్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా ప్రభావంతో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టీవీ బ్రాడ్‌క్రాస్టర్స్‌ ఆదాయం గతేడాది ఇదే మూడు మాసాలతో పోల్చితే […]

Continue Reading

చంద్రబాబుకు కనిపించని అభివృద్ధి, సంక్షేమం

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్‌ నియంత్రణ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తుంటే చంద్రబాబుకు అవి కనిపించడంలేదని.. పైగా వాటిని వ్యతిరేకిస్తూ అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. అలాంటి చంద్రబాబు అడుగులకు ఆ రెండు పత్రికలు మడుగులొత్తుతున్నాయని.. ఇది దారుణమని ఆయనన్నారు. రోజుకు 70వేల టెస్టులు చేస్తున్నది బాబుకు తెలియదా.. వాస్తవాలను ప్రభుత్వం ప్రకటనల రూపంలో ఇచ్చినా వేయడం లేదంటే అవి ఎంతగా దిగజారాయో.. వాటి నైజం ఏమిటో అర్థం చేసుకోవచ్చని […]

Continue Reading