కరోనాతో టాలీవుడ్ కమెడియన్ మృతి !

కరోనా కాటుకు టాలీవుడ్ కమెడియన్ ఒకరు కన్ను మూశారు. ప్రముఖ సినీ నటుడు కోసూరి వేణు గోపాల్‌ కరోనా బారిన పడి చికిత్స పొందుతూ నిన్న పొద్దుపోయాక మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిడంతో నిన్న మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌ సీ ఐ లో మేనేజర్‌ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల […]

Continue Reading

ఏడు రాష్ట్రాలు, యూటీల్లో 43 బ్రిడ్జిలను ప్రారంభించనున్న రక్షణమంత్రి

న్యూఢిల్లీ : లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 43 వంతెనలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వెళ్లే మార్గంలో నెచిఫూ టన్నెల్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ ఓ) తయారు చేసిన 43 వంతెనలను జాతికి అంకితం చేయనున్నారు. వంతెనల్లో 10 జమ్మూ కాశ్మీర్‌లో, హిమాచల్‌ప్రదేశ్‌లో […]

Continue Reading

రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలుపు

అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మురిసింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 49 పరుగుల తేడాతో మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జయభేరి మోగించింది. ఈ పోరులో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అలరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (54 బంతుల్లో […]

Continue Reading

భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడోరోజు ధరలు తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా ధర క్షీణించింది. హైదరాబాద్ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.760 మేర భారీగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,470 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.700 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,100కి […]

Continue Reading