సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ లో మార్పులు..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటలనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం బుధవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు జగన్ బుధవారం ఢిల్లీ నుండి నేరుగా రేణిగుంట చేరుకుంటారు. అక్కడ నుండి ఆయన రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. పద్మావతి అతిథి గృహంలో బస చేసి, అనంతరం సాయంత్రం 5.27కి అన్నమయ్య భవన్ నుంచి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. సాయంత్రం 6.15కు బేడి ఆంజనేయస్వామి ఆలయం […]

Continue Reading

మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి ఆభరణాల చోరీ

గుంటూరు జిల్లా నకరికల్లులోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. రూ.1.25లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులు, ఆలయ ట్రస్టీ నకరికంటి విశ్వనాథశర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు ఆలయం వెనుక వైపు ప్రహరీ దూకి, తర్వాత ప్రధాన ఇనుప గేట్ల తాళాలు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి వెండి కిరీటం, వెండి కళ్లు, బంగారు బొట్టు, 2 బంగారు మంగళ సూత్రాలు, వెండి పాదాలు దోపిడీ చేశారు. వీరభద్రుడి ఆలయంలో స్వామి […]

Continue Reading

ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి

మైదానం చూస్తే చాలా చిన్నది.. పైగా బ్యాటింగ్‌ పిచ్‌.. ఇంకేముంది.. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సొమ్ము చేసుకుంటూ సంజూ శాంసన్‌ చెలరేగాడు. బంతి పడిందే ఆలస్యం.. చూడాల్సింది ఆకాశం వైపే అనే తరహాలో ఏకంగా 9 సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. ఆఖర్లో ఆర్చర్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంతో రాజస్థాన్‌ జట్టు చెన్నై ముందు రికార్డు లక్ష్యాన్ని ఉంచగలిగింది. కానీ అత్యంత సీనియర్‌ లైనప్‌ కలిగిన సీఎ్‌సకే మాత్రం తమ బ్యాట్లను ఝుళిపించలేకపోయింది. అయితే డుప్లెసి ఒక్కడే […]

Continue Reading

24 గంటల్లో లక్షకు పైగా రికవరీలు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా రోగులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి రికవరీల సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఏకంగా 1,01,468 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 44,97,867కు చేరుకుంది. మరోవైపు కొత్త కేసుల సంఖ్య కూడా ఇటీవల వస్తున్న రోజూవారీ కేసులతో పోలిస్తే తగ్గాయి. మంగళవారం 75,809 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల […]

Continue Reading

త్వరలో డీఎస్సీ

దానికి ముందు టెట్‌ నిర్వహిస్తాం టెట్‌ విధివిధానాలు, సిలబస్‌ సిద్ధం 2018 డీఎస్సీ పోస్టుల భర్తీ పూర్తి కాగానే చర్యలు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ 2018 ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ విడుదల  అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ-2020పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. డీఎస్సీ కంటే ముందు టెట్‌ను నిర్వహిస్తామన్నారు

Continue Reading

పార్టీల దూకుడు

పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ ఉమ్మడి జిల్లాల కోటాలో జరగనున్న రెండు స్థానాల నుంచి వివిధ పార్టీల నుంచి పలువురు టికెట్‌ ఆశిస్తున్నారు. ఓటర్‌ నమోదు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో టికెట్‌, పార్టీల మద్దతు కోసం తమ ప్రయత్నాల్లో వేగం పెంచారు. అటు పార్టీలు కూడా ఈ ఎన్నికల విషయంలో దూకుడు పెంచాయి. నల్లగొండ స్థానంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ […]

Continue Reading

గుడ్‌న్యూస్‌: తోక ముడుస్తున్న కరోనా

మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. భారత్‌లో ఈ వైరస్ తోకముడిచే దిశగా కదులుతోంది. కొద్దిరోజులుగా దేశంలో రోజువారీగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొవిడ్‌-19 తన ప్రభావాన్ని కోల్పోతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. నిజానికి భారత్‌లో మార్చి, ఏప్రిల్‌, మే నెలలో చాలా తక్కువగా కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత నాలుగైదు రోజుల కిందటి వరకు కూడా రోజుకు […]

Continue Reading

శశికళ ముందస్తు విడుదల లేదు

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయి కోర్టులో దోషులుగా రుజువైంది. చెరో రూ.10 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ ప్రకారం 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది నాలుగేళ్లు పూర్తయి జనవరి లేదా ఫిబ్రవరి నాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే సత్ప్రవర్తన కింద ముందస్తుగానే ఈ ఏడాది […]

Continue Reading

ప్రకాశం జిల్లాలో మరో 387 కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 387 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,803కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 108 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 428 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 78 మంది డిశ్చార్జ్ అయ్యారు. 56 మందిని హోం […]

Continue Reading