ఆంధ్రప్రదేశ్‌లో కుంభవృష్టి.. వరదల బీభత్సం

ఆంధ్రప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తోంది. వరుస అల్పపీడనాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునగగా.. అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలంలోని నందిపల్లె, పాలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. తమ్మడపల్లెకు చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి వంతెన దాటుతుండగా జారిపడి వాగులో గల్లంతయ్యాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం మాముడూరులో భారీ వర్షం పడటంతో వాగులు ఉప్పొంగాయి. మాముడూరు- గుత్తి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర […]

Continue Reading

కొత్తగూడెం జిల్లాలో కలకలం.. ముగ్గురు యువతుల అదృశ్యం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే రోజు ముగ్గురు గొత్తికోయ యువతులు అదృశ్యం కావవడం కలకలం రేపుతోంది. కనిపించకుండా పోయిన ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం చెన్నాపురం కాలనీకి(గొత్తికోయ కాలనీ) చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. అయితే వారిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పంజా దేవా అనే వ్యక్తి 17వ తేదీన తీసుకెళ్లినట్టు […]

Continue Reading

నేటి నుంచి హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్లపై విచారణ

అమరావతి: నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి,మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ జరుగనుంది. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు రానున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్‌రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్దతపై రాజధాని రైతులు కేసులు వేశారు. సీర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంగానపై కేసులు నమోదు అయ్యాయి. రాజధానిలో మాస్టర్ ప్లాన్ డివియేషన్‌పైన, మౌలిక సదుపాయాల […]

Continue Reading

సూపర్ ఓవర్..ఢిల్లీ ఘన విజయం

హైదరాబాద్ : ఐపీఎల్ 2020లో భాగంగా యూఏఈలో జరిగిన రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ టై అయింది. ఇక సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ చెత్త బ్యాటింగ్‌తోటి రెండు పరుగులకే కేఎల్ రాహుల్, పూరన్‌ల వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఢిల్లీకి పూర్తి అనుకూలంగా మారింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు ఆ రెండు […]

Continue Reading

బీవండీలో కుప్పకూలిన భవనం..8 మంది మృతి

బీవండీ (మహారాష్ట్ర): అర్దరాత్రి ఫ్లాట్ల నివాసులు గాఢనిద్రలో ఉన్న సమయంలో మూడంతస్తుల భవనం సగం ఒక్కసారిగా కుప్పకూలిపోయి 8 మంది మరణించిన ఘటన మహారాష్ట్రలోని బీవండీ నగరంలో జరిగింది. బీవండీ నగరంలోని 21 ఫ్లాట్లు ఉన్న జిలానీ అపార్టుమెంటు సగం ఆదివారం అర్దరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఫ్లాట్ల నివాసులు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఘటనలో 8 మంది మరణించారు. మూడు అంతస్తుల 69వనంబరు జిలానీ అపార్టుమెంటును 1984వ సంవత్సరంలో నిర్మించారు. ఈ […]

Continue Reading

బెట్టింగ్‌ దందా గుట్టు రట్టు

ఐపీఎల్‌కి ముందే బెట్టింగ్‌ దందాను ప్రారంభించి.. దాన్ని మరింత విస్తరించేందుకు పకడ్బందీగా ప్రణాళిక రచించిన ముఠా గుట్టు రట్టయింది. ఎవరికీ అనుమానం రాకుండా ఖాళీగా ఉన్న ప్లేస్కూల్‌ను అద్దెకు తీసుకుని.. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు.. దేశవాళీ జట్లతో జరిగే మ్యాచ్‌లకు పందేలను నిర్వహిస్తూ ఐపీఎల్‌ ప్రారంభ సమయానికి తన దందాను పెంచుకోవాలని భావించారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌ను సిద్ధం చేసుకోవడంతో పాటు సిబ్బందిని నియమించకున్నారు. ఈ విషయంలో పోలీసులకు తెలియడంతో వారంతా కటకటాలపాలయ్యారు. విజయవాడలోని పోలీస్‌ కమాండ్‌ […]

Continue Reading

వారి ప్రయాణం చివరకు విషాదంతం

మారేడుమిల్లి: జోరుగా వానలు కురుస్తున్న వేళ.. అణువణువునా ఆకుపచ్చదనం సంతరించుకుని, కొత్త శోభతో మెరిసిపోతున్న మన్యసీమ ఒడిలో విహరిద్దామని వచ్చిన ఆ యువకులు.. చివరకు మృత్యుదేవత ఒడిలో ఒరిగిపోయారు. విజయవాడతో పాటు తెలంగాణకు చెందిన ఆ యువకులు మారేడుమిల్లి అందాలు చూద్దామని బయలుదేరారు. వారి ప్రయాణం చివరకు విషాదంతమైంది. వారు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా వస్తూ, మారేడుమిల్లికి కిలోమీటరు దూరంలోని వుడ్‌ కాటేజీ వద్ద మలుపులో ఆదివారం ఓ చెట్టును ఢీకొని, అదుపు తప్పి, పల్టీలు కొట్టి […]

Continue Reading

ప్రకాశం జిల్లాలో తాజాగా 613 కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 613 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,115కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 112 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 424 మంది మృత్యువాతపడ్డారు. నిన్న కరోనా నుండి కోలుకుని 72 మంది డిశ్చార్జ్ అయ్యారు. 26 మందిని హోం ఐసోలేషన్‌కు […]

Continue Reading

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు… తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పూర్వ అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నేడు, రేపు… భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల వలన వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉంది. చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, పడిపోవడం వలన సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వలన లోతట్టు ప్రాంతాలలో, చిన్న బ్రిడ్జిలు, కాజ్‌వేలలో నీరు ప్రవహించే […]

Continue Reading

కేంద్రం కుట్రలను తిప్పికొడతాం: తలసాని

కరీంనగర్‌: రైతాంగానికి అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు టీఆర్‌ఎస్‌ ఇతర పార్టీలతో కలిసి పోరాడుతుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు, అలాగే విద్యుత్‌ సంస్కరణలతో రైతులకు నష్టం జరుగుతుందని, ఈ మేరకు పార్లమెంటులో పోరాడాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారని వివరించారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్తూ కరీంనగర్‌లో మంత్రి గంగుల నివాసంలో కాసేపు ఆగారు.

Continue Reading