రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, విద్యార్థులకు తరగతులు మాత్రం ఉండవు. పాఠ్యాంశాల్లో ఏమైనా సందేహాలుంటే టీచర్లు నివృత్తి చేస్తారు. ఈ మేరకు అన్ని స్కూళ్లలో సగం మంది టీచర్లు విధులకు హాజరు కానున్నారు. కేంద్రం వెలువరించిన అన్‌లాక్‌-4 మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఆన్‌లైన్‌ తరగతు లు కొనసాగుతున్నందున ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఇతర అంశాలపై వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. శనివారం వివిధ జిల్లాల్లో […]

Continue Reading

103 ఏళ్ల వయసులో… మానవత్వంపై పెరిగిన మమత

హైదరాబాద్‌: ఆయన తొలితరం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. బ్రిటీషు అధికారుల దోపిడీ, పెత్తందారీల దౌర్జన్యాలపై పిడికిలి బిగించిన యోధుడు. ఇప్పుడు కరోనాపైనా పోరాడి విజేతగా నిలిచారు. ఆయనే 103 ఏళ్ల పరుచూరి రామస్వామి. ‘కరోనా నాకు రాదనుకున్నా. కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరాక, తిరిగి ఇంటికెళ్లననుకున్నా. నర్సులు, డాక్టర్ల మానవత్వమే నన్ను బతికించింది. కరోనాపై యుద్ధంలో నన్ను గెలిపించింది” అంటున్న రామస్వామి కొవిడ్‌ అనుభవం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.! ఇప్పుడు నా వయసు 103 ఏళ్లు. షుగరు, బీపీ వంటి […]

Continue Reading

చిక్కుల్లో పడిన ఆర్య

ఈ మధ్య నటీనటులు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోతున్నారు. ఈ క్రమంలో కొందరు అరెస్టు కూడా అయి జైలుపాలవుతున్నారు. మరికొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరు విచారణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. హీరో ఆర్య చిక్కుల్లో పడ్డారు. అయితే.. ఇది దాదాపుగా తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన సినిమాకు సంబంధించిన వివాదం ఇప్పుడు విచారణకు వచ్చింది. దీనికి సంబంధించి, ఆర్యకు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. నిజానికి.. ఆర్య ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోలేదు. అలాంటి వాటికి […]

Continue Reading

పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

కుమురం భీం : కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజూమున కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత అడేళ్లు అలియాస్‌ భాస్కర్‌తోపాటు మరొకరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో రెండు తుపాకులు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు నేత భాస్కర్‌ వచ్చాడనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు […]

Continue Reading

నేటి నుంచి సచివాలయ పరీక్షలు

అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలకుగాను గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించి 1,10,520 పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 16,208 పోస్టులు మిగిలిపోయాయి. గ్రామ సచివాలయ పోస్టులు 14062 కాగా, వార్డు సచివాలయ పోస్టులు 2146 ఉన్నాయి. మొత్తం 10.56 లక్షల మంది దరఖాస్తు […]

Continue Reading

ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

అబూధాబీ: ఐపీఎల్ 2020లో భాగంగా అబూధాబీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. చెన్నై జట్టు ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక చెన్నై నుంచి ఓపెనర్లుగా దిగిన వాట్సన్ 4 పరుగులకు, మురళి విజయ్ ఒక రన్‌కు ఔట్ అయిపోయారు. చెన్నై ఓపెనర్లు కొద్దిపరుగులకే పెవిలియన్ చేరారు. […]

Continue Reading

ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1065 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,505కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 416 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 75 మంది డిశ్చార్జ్ అయ్యారు. 60 మందిని హోం […]

Continue Reading

రేషన్‌ బియ్యం తరలిస్తున్న ముఠా అరెస్ట్‌రేషన్‌ బియ్యం తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం దుండిగల్‌ పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ నర్సింహరావు వివరాలు వెల్లడించారు. తాండూరు ప్రాంతంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన లారీ డ్రైవర్లు మహ్మద్‌ ఇక్బాల్‌(24), మహ్మద్‌ అఫ్సర్‌(27), ఆటోడ్రైవర్లు అబ్దుల్‌ అఫ్జల్‌(38), జబ్బార్‌మియా(28), అబ్దుల్‌ నయీం(31), తోషిఫ్‌(20), మహ్మద్‌ ఆసిఫ్‌ (25)లు ముఠాగా ఏర్పడ్డారు. వారు రోడా మేస్త్రీనగర్‌ ప్రాంతం నుంచి కర్నాటకకు రేషన్‌ బియ్యాన్ని ఆటో ట్రాలీలలో తరలిస్తుంటారు. […]

Continue Reading

అన్నను హత్యచేసిన తమ్ముడు

తాగుడుకు బానిసలుగా మారిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణతో తమ్ముడు అన్నను దారుణంగా హత్య చేసి చంపాడు. ఈ ఘనట మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నెహ్రూనగర్‌లో నివాసముంటున్న హనుమాన్‌ సింగ్‌(42) నర్సింగ్‌ సింగ్‌(40) అన్నదమ్ములు వీరు ప్రతి రోజు మద్యం సేవించి కొట్లాడుకునే వారు. వీరి పోరు భరించలేక హనుమాన్‌ సింగ్‌ భార్య లక్ష్మీబాయి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది.శుక్రవారం రాత్రి అన్నదమ్ములు తాగి ఘర్షణ పడ్డారు.దీంతో […]

Continue Reading

కొత్త కేసులు 8,218

కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ 8వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 74,595 మందికి పరీక్షలు నిర్వహించగా 8,218 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 6,17,776కు చేరాయి. తాజాగా మరో 10,820 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 5,30,711 మంది డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ 58మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. చిత్తూరులో 9మంది, కృష్ణాలో ఏడుగురు, అనంతపురం, […]

Continue Reading