ప్రకాశం జిల్లాలో 506 కరోనా కేసులు

ప్రకాశం: జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా 506 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,840 కి చేరుకుంది. ఒంగోలులో అత్యధికంగా 186 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కరోనా వల్ల జిల్లాలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 411కు చేరుకుంది. ఇక గురువారం నాడు కరోనా […]

Continue Reading

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200 నుంచి 300 వరకు బస్సులు తిప్పనుంది. 60 శాతం ప్రయాణికులకు అనుమతి ఇవ్వనున్నారు. 20 నుంచి 26 వరకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు వెళ్లే విద్యార్థుల కోసం అదనపు బస్సులను నడుపనున్నారు. 26న తరువాత ప్రయాణికుల డిమాండ్‌కు […]

Continue Reading

సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ : ఏపీ సీఎం

హైదరాబాద్ : రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10 ప్రాంతాల్లో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీజీఈసీఎల్ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో టెండర్ డాక్యుమెంట్ల జ్యుడీషియల్ ప్రివ్యూ ఉంచినట్లు చెప్పింది. జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం తర్వాత టెండర్లు నిర్వహిస్తామని ఏపీజీఈసీఎల్‌ స్పష్టం చేసింది. అయితే, వ్యవసాయ, బీడు భూముల్లో సౌర విద్యత్ కేంద్రాల ఏర్పాటను ప్రోత్సాహించాలని […]

Continue Reading

దేవాలయాలపై దాడికి నిరసనగా ‘ఛలో అంతర్వేది’ పిలుపునిచ్చిన బీజేపీ

అమరావతి: రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేడు ‘ఛలో అంతర్వేది’కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. హిందూవాదులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పిలుపు నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఛలో అమలాపురం ఈ రోజు జరిగి తీరుతుందని వీర్రాజు స్పష్టం […]

Continue Reading

గుంటూరు జిల్లాలో దళిత కుటుంబంపై దాడి

గుంటూరు జిల్లాలో దళిత కుటుంబంపై ఆకతాయిలు దాడి చేశారు. బాపట్ల 11వ వార్డు దేవుడి మాన్యంలో ఈ ఘటన జరిగింది. బాధితుల కథనం మేరకు.. బుధవారం రాత్రి భానుప్రసాద్‌ అనే వ్యక్తి మార్చురీ బాక్సు తీసుకొని వెళుతుండగా కారుమూరి హనుమంతరావు కాలనీ వద్ద కొందరు ఆకతాయిలు అడ్డగించి వాదనకు దిగారు. స్థానికులు సర్దిచెప్పి వారిని పంపించారు. భానుప్రసాద్‌ ఇంటికి వెళ్లిన పది నిమిషాలకు 20 మంది యువకుల గుంపు అక్కడికి వచ్చారు. భానుప్రసాద్‌తో పాటు అతడి భార్య […]

Continue Reading

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్‌ గ్రామానికి చెందిన లింగంపెల్లి దేవరావు(48) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవరావు తనకున్న మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. పంట పండించడం కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద, బ్యాంకుల్లో అప్పులు చేశాడు. పంట వేసిన ప్రతిసారి దిగుబడి సరిగా రాలేదు. చేసిన అప్పులు రూ.8 లక్షల వరకు పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురై బుధవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. […]

Continue Reading

రూ.2 కోట్ల విలువైన వజ్రాల నగల అపహరణ..

విల్లుపురం పట్టణానికి చెందిన కరుణానిధి (45) తన తాత మలేషియా నుంచి తెచ్చిన వద్ద రూ.2 కోట్ల విలువైన వజ్రాల నగలున్నాయని చెబుతూ వాటి విక్రయానికి సిద్ధమయ్యాడు. తన ఇంటికి రంగులు వేసేందుకు వచ్చిన శివ అనే యువకునితో నగలు కొనుగోలు చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని కోరాడు. చెన్నైలో తనకు తెలిసిన ఇద్దరు ఉన్నారని, వారి ద్వారా అమ్మవచ్చని శివ నమ్మబలికాడు. చెన్నై సాలిగ్రామానికి చెందిన అరుళ్‌ మురుగన్‌ (55), వడపళినికి చెందిన సెంథిల్‌ (44)లను […]

Continue Reading

భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

మద్యం విక్రయదారులు ఏకంగా ఆర్టీసీ పార్శిల్‌ బస్సునే వాడుకున్నారు. తెలంగాణ నుంచి ఏకంగా 2198 మద్యం సీసాలను విజయవాడ, ఏలూరుకు తీసుకొస్తూ పట్టుబడ్డారు. హైదరాబాద్‌ డిపో నుంచి కొవ్వూరు డిపోకు బయలు దేరిన ఏపీ 29జెడ్‌ 0408 ఆర్టీసీ పార్శిల్‌ బస్సులో గురువారం ఉదయం బెంజిసర్కిల్‌ వద్ద మద్యం అట్టపెట్టెలను దించుతుండగా పటమట ఎక్సైజ్‌ పోలీసులు దాడి చేశారు. బస్సు డ్రైవర్లుగా ఉన్న తోట నాగరాజు, గమిడి నాగరాజు(కొవ్వూరు), మెకానిక్‌ ఎం.శ్రీనివాసరావుతో పాటు పార్శిల్స్‌ను తీసుకుంటున్న విజయవాడకు […]

Continue Reading

నాకు కావాల్సిందే ఇదే : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారికి దూరంగా ఉండేందుకు మాస్క్‌లు ధరించడం కొనసాగించాలని, సామాజిక దూరం నిబంధనలను పాటించాలని కోరారు. చాలా మంది తనకు పుట్టిన రోజు ఎలాంటి కానుక కావాలని అడిగారని గురువారం అర్ధరాత్రి ట్వీట్‌ చేశారు. ‘చాలామంది నా పుట్టిన రోజున నేను ఏమి కోరుకుంటాను. ఇప్పుడు నేను కోరుకునేది మాస్క్‌లు సరిగ్గా ధరించండి.. సామాజిక దూరాన్ని అనుసరించండి’ అని ట్వీట్‌ […]

Continue Reading

పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి కేటీఆర్‌ ఆరా

ఇళ్ల నిర్మాణదారుల నుంచి డబ్బుల వసూళ్లపై అడిక్‌మెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ హేమలతారెడ్డి, ఆమె భర్త జయరాంరెడ్డి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ, పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి కేటీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు, జీహెచ్‌ఎంసీ మేయర్‌, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను ఆదేశించినట్లు సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులతోపాటు ఎమ్మెల్యే గోపాల్‌ వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. , కార్పొరేటర్‌ హేమలతారెడ్డిని బర్తరఫ్‌ […]

Continue Reading