సీఎం జగన్ కంటే ఫాస్ట్ గా ఉన్న గ్రామ వాలంటీర్..

దరఖాస్తు చేసుకున్న 10రోజుల్లోగా అర్హత ఉన్న వారికి రేషన్ కార్డు మంజూరు చేయాలనేది ప్రభుత్వ విధానం. ఈ పదిరోజుల లోపు దరఖాస్తు చేసుకున్నవారి అర్హతలు పరిశీలించి, గ్రామంలో విచారణ చేపట్టి రేషన్ కార్డు మంజూరు చేస్తారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ విధానం చాలా వేగంగా మారిపోయింది. అయితే జగన్ 10రోజుల టార్గెట్ పెట్టారు కానీ, మన వాలంటీర్లు మాత్రం భలే స్పీడ్ గా ఉన్నారు. కేవలం ఒక్కరోజులోనే రేషన్ కార్డు మంజూరు చేసి రికార్డు […]

Continue Reading

రూ.31.75 లక్షల విలువైన గుట్కా, ఖైనీ పట్టివేత

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: కర్ణాటక నుంచి హైదరాబాద్‌ మీదుగా విజయవాడకు భారీ మొత్తంలో నిషేధిత గుట్కాలు, ఖైనీలను తీసుకొచ్చిన 8 మందిని విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.31.75 లక్షల విలువైన గుట్కాలు, ఖైనీలు, 1 లారీ, 1 వ్యాను, 2 కార్లతో పాటు రూ.6.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి భారీ మొత్తంలో గుట్కాలు వచ్చాయన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ కె.వి.శ్రీనివాసరావు, ఏసీపీ వి.ఎస్‌.ఎన్‌.వర్మలు […]

Continue Reading

సమస్యల ప్రస్తావనపై సర్వత్రా హర్షం

ధర్మపురి: మత్స్యకారుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఉన్న మత్స్యకారుల అభివృద్ధికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుతలో ఉచితంగా అందించిన చేప పిల్లలను మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఆయన ధర్మపురి మండల మత్స్యకారులకు బుధవారం పంపిణీ చేసి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నాలుగేళ్లుగా మత్స్య సంపద ఎంతగానో […]

Continue Reading

చంద్రబాబు, టీడీపీ నేతలపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ధ్వజం

అమరావతి: రాజధాని భూముల వ్యవహారాల్లో దమ్ముంటే విచారణ చేసుకోవాలని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి ‘స్టే’ ఎందుకు తెచ్చుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సవాల్‌ చేసి పారిపోవడంపై చంద్రబాబు, టీడీపీ నేతలు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి బొత్స బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని మేం నిస్వార్థపరులం, రుషి పుంగవులం అంటే ఎలా? […]

Continue Reading

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి

అమరావతి భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కుంభకోణంపై సిట్‌ దర్యాప్తు జరుగుతుండగా హైకోర్టు దానిపై విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చిందన్నారు. అంతేకాకుండా సదరు వ్యవహారం మీడియాలో రాకుండా ‘నిషేధిత’ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఓ న్యాయమూర్తి కుటుంబీకులు ఇందులో ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు ఒకేలా ఉండాలన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో బుధవారం […]

Continue Reading

ఆయుర్వేద సంస్థలను అన్ని రాష్ట్రాలకు విస్తరించండి

న్యూఢిల్లీ: ఆయుర్వేద విద్య, పరిశోధనలో జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలను దేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాల్లోనూ నెలకొల్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేద బిల్లు 2020’పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్‌ను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను విస్మరించినట్లుగా […]

Continue Reading

రష్యా వ్యాక్సిన్‌ వయా డాక్టర్‌ రెడ్డీస్‌

కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ విషయంలో భారత్‌లో పెద్ద ముందడుగు పడింది. ఈ ఏడాదే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ దేశంలో అడుగు పెట్టనుంది. ఈ వ్యాక్సిన్‌ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై  హైదరాబాద్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్‌డీఐఎఫ్‌ సరఫరా చేయనుంది. పరీక్షలు […]

Continue Reading

కంటైనర్‌లోకి చొరబడి దొంగతనం

లక్షా రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.80 లక్షల విలువైన సెల్‌ఫోన్‌లను దొంగిలించిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద వెలుగుచూసింది. సినీ ఫక్కీలో కంటైనర్‌లోకి చొరబడిన ఆగంతకులు.. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమలో తయారైన 980 రెడ్‌మి ఫోన్లను గోతాల్లో నింపుకుని పారిపోయారు.

Continue Reading

ఒకరు మృతి.. పరారీలో బస్సు డ్రైవర్‌

ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున మొక్కజొన్న లోడుతో ఏలూరు వైపు వెళ్తున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు సహాయక డ్రైవర్‌ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒడిశా నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మొత్తం 34 మంది వలస […]

Continue Reading

హైదరాబాద్లో 3గంటలపాటు కుండపోత వర్షం

హైదరాబాద్ : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఈస్ట్‌, వెస్ట్‌ షియర్‌జోన్‌, ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో బుధవారం మూడుగంటలపాటు కుండపోత వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో పెద్ద ఎత్తున కురిసిన గాలివాన వల్ల నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పళ్లపు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువలను తలపించాయి. గ్రేటర్‌లోని పాతబస్తీ బహదుర్‌పురా, చందూలాల్‌బరాదరిలో అత్యధికంగా 11సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా పటాన్‌చెరు, మహేశ్వరంలో అత్యల్పంగా […]

Continue Reading