దారుణం.. వృద్ధురాలిపై నడిరోడ్డుపై దాడి.. కిందపడేసి కుర్చీతో కొట్టి..

ఆమెకు 70 ఏళ్ల వయసు ఉంటుంది. అలాంటి వృద్ధురాలిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే విచక్షణా రహితంగా కొట్టాడు. కిందపడేసి కుర్చీతో చావబాదాడు. యూపీలోని ఘజియాబాద్‌ జిల్లా రాజాపూర్ గ్రామంలో సెప్టెంబర్ 12న ఈ ఘటన జరిగింది. వృద్ధురాలిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలి నేలపై పడేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న ఆ పెద్దావిడపై కుర్చీతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకు […]

Continue Reading

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు.. దీంతో వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్దమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ధర్మ పోరాట చేసాడు. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి పవన్ […]

Continue Reading

దేశంలో 50 లక్షలు దాటిన కరోనా బాధితులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశంలో ఈ వ్యాధి బారిపడినవారి సంఖ్య 50 లక్షలు దాటింది. ఇదేసమయంలో మృతుల సంఖ్య 82 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన తాజా వివరాల ప్రకారం దేశంలో కరోనా రోగుల సంఖ్య 50,08,878కి చేరింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 81,964 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకూ 82,038 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9,93,075 యాక్టివ్ కేసులు ఉండగా, 39,31,356 మంది […]

Continue Reading

స్టోక్స్ వచ్చేనా.. రాజస్థాన్ బెంగ తీరేనా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే.. వివిధ దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లంతా కలిసి ఆడే గొప్ప ఈవెంట్..! అప్పుడప్పుడు కొన్ని కొన్ని కారణాల వలన కొందరు ఆటగాళ్లు జట్లకు దూరమవుతూ ఉంటారు. అయితే స్టార్ ఆటగాళ్లు ఒక్కోసారి దూరమైతే మాత్రం ఆయా ఫ్రాంచైజీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అలాంటి ఆటగాళ్ల లిస్టులోనే బెన్ స్టోక్స్ ఉంటాడు. బెన్ స్టోక్స్ ఏ జట్టులో ఉన్నా కూడా బలమే.. అందుకే రాజస్థాన్ రాయల్స్ జట్టులో అతడు స్టార్ ఆటగాడయ్యాడు. […]

Continue Reading

ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసై.. ప్రాణాలు తీసుకున్నడు..

చెన్నై : ఆన్‌లైన్‌ గేమింగ్‌ కల్చర్‌ ఇటీవల బాగా పెరుగుతోంది.. వాటికి యువత బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకుంటూ అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమిళనాడు రాజధానిలో ఓ యువకుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌లో సుమారు రూ.8లక్షలను పోగొట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన దినేశ్‌ (28) ఓ ప్రైవేట్‌ టెలికాం సంస్థలో పని చేస్తున్నాడు. ఇంతకు ముందు దినేష్‌ తన స్నేహితుల నుంచి అప్పును తీసుకొని భారీ మొత్తాన్ని ఆన్‌లైన్‌ గేమింగ్‌లో […]

Continue Reading

మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా

కొత్తగూడెం : మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇందులో భాగంగా 2016 నుంచి మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. మిషన్‌ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించింది. ఏటా ఆగస్టులో చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నారు. ఇప్పటికే 60 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. 2020 -21 ఆర్థిక సంవత్సరానికి గాను 691 చెరువుల్లో చేప పిల్లలను […]

Continue Reading

8 బిల్లులకు మండలి ఆమోదం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8 బిల్లులను శాసనమండలి ఆమోదించింది. సోమవారం అసెంబ్లీలో ఆమోదించిన ఈ బిల్లులను మంగళవారం మండలిలో ప్రవేశపెట్టగా, సభ్యులు ఆమోదించారు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ సంతకం చేశాక చట్టంగా అమల్లోకి వస్తాయి. శాసనమండలి ఆమోదించిన బిల్లులు ఇవే.. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల బిల్లు-2020 తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు-2020 తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు-2020 (ఆయుష్‌ మెడికల్‌ కళాశాలల ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పదవీ […]

Continue Reading

ఇప్పటికే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధంపై ఏపీలో దుమారం రేగుతోంది. ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినప్పటికీ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఉత్సవాల్లో వినియోగించే వెండి రథం సింహాల్లో మూడు మాయమయ్యాయి. మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. దానిని కూడా పెకిలించేందుకు ప్రయత్నించి విఫలమయినట్లు తెలిసింది. ఒక్కో సింహం […]

Continue Reading

రోజురోజుకూ పెరుగుతున్న రికవరీ

అమరావతి: రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పాజిటివ్‌ కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 70,511 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 8,846 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 9,628 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. 69 మంది కోవిడ్‌ కారణంగా మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 47,31,866 టెస్టులు చేయగా, 5,83,925 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Continue Reading

ప్రకాశం జిల్లాలో మరో 649 కరోనా కేసులు నమోదు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 649 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,607కు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 138 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 395 మంది కరోనాతో మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 85 మంది డిశ్చార్జ్ అయ్యారు. 85 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. […]

Continue Reading