హోదా కోసం నిరంతర ప్రయత్నం చేయాలి

హోదా కోసం నిరంతర ప్రయత్నం చేయాలి వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి జగన్‌ దిశా నిర్దేశం పార్లమెంటు వర్షాకాల సమావేశాల వ్యూహంపై చర్చ దిశ చట్టం, ప్రత్యేక కోర్టులకు రాష్ట్రపతి ఆమోదం కావాలి పోలవరం నిధులు కోరాలి.. జీఎస్టీ బకాయిలు ప్రస్తావించాలి పట్టణ స్థానిక సంస్థల పెండింగ్‌ నిధులపై దృష్టి పెట్టాలి 13 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి వచ్చేలా చూడాలి కేంద్ర గిరిజన వర్సిటీని రెల్లి నుంచి సాలూరుకు మార్చాలి

Continue Reading

బిస్కెట్లు తిని ఇద్దరు చిన్నారులు మృతి

కిరాణా దుకాణంలో బిస్కెట్‌ పాకెట్‌ కొని తిన్న ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలుజిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హుసేన్‌ బాషా దంపతులు ఆదివారం పొలంపనికి వెళ్లారు. వారి కుమారుడు హుసేన్‌ బాషా(6), కూతురు హుసేన్‌బీ(4)లతోపాటు చిన్న హుసేన్‌ బాషా కూతురు జమాల్‌బీ సాయంత్రం సమీపంలోని దుకాణాల్లో బిస్కెట్లు కొనుక్కొని తిన్నారు. ఆ వెంటనే ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. పొలం […]

Continue Reading

కరీంనగర్‌ జైలులో ఓ రిమాండ్‌ ఖైదీ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన సంబు కొమురయ్య (45)ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి కొమురయ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు.

Continue Reading

నిధులు.. ప్రాజెక్టులు..హోదా

కేంద్రం నుంచి రావలసిన నిధులను రాబట్టేలా, పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతులు సాధించేలా పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాలని కోరారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆయన అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఢిల్లీ నుంచి వారు పాల్గొన్నారు. ఈ భేటీలో పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి, లోక్‌సభలో నేత మిథున్‌రెడ్డితోపాటు ఢిల్లీ చేరిన ఎంపీలు పాల్గొన్నారు. కొంతకాలంగా అధినేతపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా అసమ్మతి […]

Continue Reading

అమరావతిని కాపాడండి

ఏపీ రాజధాని అమరావతిని కాపాడాలని కోరుతూ 29 గ్రామాల రైతులు, మహిళలు, రైతు కూలీలు ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం బహిరంగ లేఖ రాశారు. అమరావతిపై పార్లమెంటులో ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కనీసం అమరావతి హద్దులు కూడా తెలియని వైసీపీ నేతలు.. తమపై నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలన్న డిమాండ్‌తో రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన సోమవారానికి 272వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా రైతులు […]

Continue Reading

పెళ్లి చేసుకోవాలంటూ టీవీ నటి శ్రావణి (26)ని సాయికృష్ణారెడ్డి (సాయి), దేవరాజ్‌, ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర నిర్మాత అశోక్‌రెడ్డి వేధించారని… పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడు దేవరాజ్‌ మోసం చేశాడని.. ఈ ముగ్గురి కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ-1గా సాయి, ఏ-2గా అశోక్‌రెడ్డి, ఏ-3గా దేవరాజ్‌పై కేసు నమోదు చేశారు. నిందితుల్లో సాయి, దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం వెస్ట్‌జోన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ […]

Continue Reading

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పుల బాధతో సోమవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంటకు చెందిన వెలిశోజు రాజేందర్‌ (35) పత్తి పంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురైన రాజేందర్‌ క్రిమిసంహారక మందు తాగాడు. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కోటగిరి అశోక్‌ (45) ఆరు నెలల క్రితం రూ.10 లక్షలు అప్పు చేసి మూడెకరాలను […]

Continue Reading

యువకుడి కిడ్నాప్‌ కేసులో కార్పొరేటర్‌ అరెస్టు

చైతన్యపురి: యువకుణ్ని కిడ్నాప్‌ చేసి చితకబాదిన కేసులో బోడుప్పల్‌ కార్పొరేషన్‌ ఆరో డివిజన్‌ కార్పొరేటర్‌ టి.అజయ్‌యాదవ్‌(26)తో పాటు మరో ఇద్దరిని సోమవారం చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం.. కొత్తపేట హరిపురికాలనీకి చెందిన యారాసింగ్‌ దుర్గాప్రసాద్‌, అజయ్‌యాదవ్‌ మధ్య ఆర్థికపరమైన గొడవలున్నాయి. శనివారం రాత్రి అజయ్‌యాదవ్‌, అతని స్నేహితులు ఎం.సాయికుమార్‌, కె.చంద్రారెడ్డి దుర్గాప్రసాద్‌ ఇంటికి వెళ్లి అపహరించి తీవ్రంగా కొట్టి ఆదివారం వదిలిపెట్టారు. బాధితుడు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Continue Reading

భూముల్లేవు.. సాముల్లేరు..!

90 శాతం భూములు పేదల వద్దే 25 ఎకరాలపైన ఉన్న వారు 6 వేల మందే పేద రైతుల కోసమే చట్టాలు! భూముల విలువలను సవరిస్తాం ధరణి రిజిస్ట్రేషన్లకు ముందే నిర్ణయం సబ్‌ రిజిస్ట్రార్ల విచక్షణాధికారం రద్దు రికార్డుల్లోని ధరలకే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకెళ్లిన అరగంటలోపే రిజిస్ట్రేషన్‌ చిన్నచిన్న లోపాలకు సర్వేనే పరిష్కారం ప్రస్తుత కేసుల పరిష్కారానికే ట్రైబ్యునళ్లు కొత్త భూవివాదాలపై కోర్టులకెళ్లాల్సిందే సర్వేలో 1/70 భూములను ముట్టుకోం ఇకపై ఒకే భూమిని నలుగురైదుగురు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం […]

Continue Reading

రౌడీషీట్‌ తెరిచారనే భయంతో వ్యక్తి ఆత్మహత్య

పోలీసులు రౌడీషీట్‌ తెరిచారని కొందరు భయపెట్టడంతో ఆందోళనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్‌ జిల్లా హవేళీఘణపూర్‌ మండలం నాగాపూర్‌ గ్రామానికి చెందిన హైమద్‌(35) ఓ హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆదివారంమధ్యాహ్నం హైమద్‌కు అదే గ్రామానికి చెందిన శంకర్‌, జయరాములు, ఆనందర్‌, రాజేందర్‌ రెడ్డి కలిసి అతడిపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచారని, ఫొటోలను పోలీస్‌స్టేషన్‌లో, గ్రామ పంచాయతీలో పెడతారని చెప్పారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన హైమద్‌ సాయంత్రం బావమరిదికి ఫోన్‌ చేసి […]

Continue Reading