ఎరువుల కర్మాగారాన్ని బీజేపీ కార్యాలయంలా మార్చారు

హైదరాబాద్‌: కేంద్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రామగుండం ఎరువుల కర్మాగారంలో సమీక్షకు ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు. కానీ ప్రొటోకాల్‌ పాటించలేదు. స్థానిక ఎంపీగా నాకు ఆహ్వానం అందలేదు. ఈ సందర్భంగా ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కూడా అబద్ధాలు చెప్పడం విడ్డూరం. తెలంగాణకు రావాల్సిన 13 లక్షల మెట్రిక్ […]

Continue Reading

సీఎంతో రాజకీయాలు చర్చించలేదు: చాడ

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌తో తాను సమావేశమైన సందర్భంగా రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని, కేవలం రెవెన్యూ బిల్లుపైనే చర్చించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. రెవెన్యూ బిల్లుపై గతంలో సీపీఐ, టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వెల్లడైన సూచనలతో పాటు, తమ పార్టీ అభిప్రాయాలను ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. శనివారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకురాలు పశ్య పద్మతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీపీఐ ఆధ్వర్యంలో […]

Continue Reading

ఉరి వేసుకుంటున్నట్టు నాటకమాడి..

చెన్నై: ఉరి వేసుకుంటున్నట్టు నాటకమాడి సెల్ఫీతో రక్తికట్టించిన ఓ యువకుడు చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తేని జిల్లా బొమ్మినాయకన్‌ పట్టికి చెందిన ద్రవ్యం(23) శివగంగైలోని ఓ బోర్‌వెల్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఇతగాడు బంధువులు, మిత్రుల్ని బెదిరించేందుకు ఓ నాటకం ఆడాడు. ఇంటి దూలానికి ఉరి వేసుకుంటున్నట్టు సెల్ఫీ తీశాడు. దానిని మిత్రులు, బంధువులకు పంపించాడు. రెండుసార్లు సెల్ఫీ తీసి పంపించిన ద్రవ్యం మూడో ప్రయత్నం బెడిసి కొట్టింది.

Continue Reading

షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలంటూ..

హైదరాబాద్‌: షేర్ మార్కెట్‌లో మోసాలకు పాల్పడుతున్న 9 మంది నిందితులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తె షేర్‌ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నిందితులు నమ్మించారు. కాగా షేర్ మార్కెట్లో అనుభవం ఉందంటూ వనస్థలిపురంకు చెందిన ఓ ప్రయివేట్ ఉద్యోగితో రూ 9.60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు

Continue Reading

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం

నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న గూడ్స్ లారీ వేగంగా వచ్చి క్యూలైన్లలో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు ఇందల్వాయి ఏఎస్‌ఐ బాల్‌సింగ్ తెలిపారు. వేగంగా వస్తున్న లారీ టోల్ ప్లాజా వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పినట్టు తెలుస్తోంది. గాయాలపాలైన వారిని టోల్ ప్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి […]

Continue Reading

ప్రేమ పేరుతో మోసపోయి బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్‌: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఎవరిని ప్రేమించకండి, చచ్చేదాకా మనతో ఎవరుంటారో వారినే ప్రేమించండి అంటూ తన మిత్రులకు బాయ్‌ చెప్తూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది.

Continue Reading

సభ్యసమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు

అమరావతి: చంద్రబాబు రాష్ట్రానికి శనిలాగా దాపురించారని, సభ్య సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో కూడా రథం తగలబడితే బీజేపీ, పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. మతాలకు అతీతంగా వైఎస్‌ కుటుంబం ప్రజలను ప్రేమిస్తుందని, హిందువుల మనోభావాలను ఎల్లప్పుడూ గౌరవించారని చెప్పారు. చెప్పులు వేసుకుని శంకుస్థాపనలు, పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్న చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఎర్రచందనం […]

Continue Reading

40 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ

అమరావతి: ఆది నుంచి పార్టీలో కొనసాగిన వారికే పెద్దపీట వేస్తూ బీజేపీ రాష్ట్ర పదాధికారుల కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏర్పాటుచేశారు. ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, పది మంది ఉపాధ్యక్షులు, మరో పది మంది కార్యదర్శులతో కలిపి మొత్తం 40 మందితో పార్టీ రాష్ట్ర కమిటీని ఆదివారం ఆయన ప్రకటించారు. ఇందులో నలుగురు మినహా మిగిలిన వారందరూ తొలి నుంచి బీజేపీలో పనిచేస్తున్న వారే. శాసన మండలిలో బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ […]

Continue Reading

మే నాటికే దేశంలో 65 లక్షల మందికి కరోనా

హైదరాబాద్: దేశంలో గత మే నాటికే కరోనా కరాళనృత్యం చేస్తోందని.. అప్పటికే 64,68,388 మంది (జనాభాలో 0.73 శాతం) కరోనా బారిన పడినట్లు తాజా సర్వే చెబుతోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ‘సెరో సర్వే’పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. గత మే 11 నుంచి జూన్‌ 4 మధ్య కాలంలో 28 వేల మందిపై జాతీయస్థాయిలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహించింది. వీరి రక్త నమూనాలు సేకరించి కోవిడ్‌ కవచ్‌ ఎలీసా టెస్ట్‌ కిట్‌ […]

Continue Reading

రావాల్సిన నిధులపై చర్చకు పట్టుపడతాం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గట్టిగా అడుగుతామని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పార్లమెంట్‌లో స్పీకర్‌ నిర్వహించిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ లేవనెత్తదలుచుకున్న అంశాలన్నింటిపై స్పీకర్‌తో చర్చించాం. ► కరోనా నియంత్రణ, లద్దాఖ్‌లో చైనా దూకుడు, కరోనా పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్‌టీ, పన్నుల వాటా పంపిణీ, రాష్ట్రానికి సెంట్రల్‌ […]

Continue Reading