ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభణ

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 1028 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,635కు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 330 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఏడుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 351 మంది మృత్యువాతపడ్డారు. నిన్న కరోనా నుండి కోలుకుని 76 మంది డిశ్చార్జ్ అవగా… 89 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. […]

Continue Reading

మీటర్లు ఉంటే నాణ్యమైన విద్యుత్తు.. ఏపీ సిఎం జగన్!

YS Jagan on Electricity to Farmers |రైతులకు విద్యుత్ బిల్లు సమస్య ఉండదని సీఎం జగన్ స్పష్టం చేసారు. రాబోయే 30 ఏళ్ల వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు, రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే మీటర్లు ఉండాలన్న జగన్.. మీటర్ల ద్వారా ఫీడర్లపై భారం ఎంతో తెలుస్తుందని వివరించారు. ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలలో డబ్బు జమచేస్తుందన్నారు. మరో పక్క జనతా బజార్లు, షెడ్యూలింగ్, సెకండరీ ప్రాసెసింగ్ పై ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను […]

Continue Reading

అంతర్వేది రథం రగడ.. ప్రభుత్వానికి బిగుస్తున్న ఉచ్చు?!

ఏపీలో ప్రభుత్వం ఔనన్నా.. కాదన్నా హిందూ దేవాలయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న మాట నిజమేనని నమ్మాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జరిగిన పలు ఘటనలకు ప్రభుత్వం దగ్గర సూటి సమాధానం లేకపోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం దగ్గర నుండి ఇతర మతాల వారికి టీటీడీ లో ఉన్నత ఉద్యోగాల వరకు పలు విమర్శలకు ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది తప్ప తన నిజాయతీని నిరూపించుకొనే […]

Continue Reading

ప్రజలకు పవన్ పిలుపు.. సాయంత్రం 05.30 గంటలకు

ఏపీలో అంతర్వేది ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. రథం దగ్ధం వెనక కుట్రం ఉందని బీజేపీ, జనసేన, టీడీపీ ఆరోపించడం.. ఛలో అంతర్వేదికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చలో అంతర్వేది కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు. ఐతే దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సనాతన ధర్మాన్ని […]

Continue Reading

269వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం

అమరావతి: రాజధాని ప్రాంత రైతులు, మహిళల నిరసనలు 269 రోజులకు చేరుకున్నాయి. రాజధాని అమరావతి పరిధిలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి, తదితర గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిని మార్చొద్దంటూ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు, మహిళలు తేల్చి చెప్పారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Continue Reading

కనకదుర్గమ్మ దర్శనం 3 గంటలు పెంపు

కనకదుర్గమ్మ దర్శనానికి మరో 3 గంటల సమయాన్ని పెంచారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనల మేరకు ప్రస్తుతం రోజూ ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తున్నారు. శుక్రవారం నుంచి ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించ నున్నారు. కొవిడ్‌ నిబంధనలు, భౌతిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఆలయ అధికారులు […]

Continue Reading

కరోనా మందని చెప్పి.. విషం తాగిన యువకుడు…

ఖైరతాబాద్‌ : కరోనా కారణంగా వ్యాపారం మూతపడింది… ఆదాయం నిలిచిపోయి..తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు కరోనా మందు అని చెప్పి.. విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం అని తెలియక తండ్రి తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎర్రమంజిల్‌లోని హిల్‌టాప్‌ కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో అల్లంపాటి శ్రావణి రెడ్డి, రామిరెడ్డి దంపతులు కుమారుడు అనీశ్‌ రెడ్డి (33)తో కలిసి నివాసం ఉంటున్నారు. […]

Continue Reading

బీరూట్‌ పోర్టులో మళ్లీ భారీ అగ్ని ప్రమాదం

లెబెనాన్‌ రాజధానిలో వరుస ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బీరూట్‌ పోర్టులో జరిగిన భారీ పేలుళ్ల ఘటన మర్చిపోకముందే మళ్లీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. టైర్లు, ఆయిల్‌ నిల్వ ఉంచిన గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది.. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపు చేశారు. ఈ మంటలతో దట్టంగా పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. బీరూట్‌లో ఆగస్టు 4న చోటు చేసుకున్న భయానక పేలుడు […]

Continue Reading

2.50 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

మహబూబాబాద్‌ రూరల్‌: పట్టణ శివారులో 2.50 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని అక్రమంగా తరలిస్తుండగా గురువారం పట్టుకున్నట్లు మహ బూబాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ రమేశ్‌చందర్‌ తెలిపారు. జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారి ఆదేశాల మేరకు మానుకోట ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా పట్టణ శివారు సాలార్‌తండా సమీపంలోని జాతీయ రహ దారిపై డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 2.50 క్వింటాళ్ల నల్లబెల్లం, 30 కిలోల పటిక,10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, బెల్లం […]

Continue Reading

దారుణం : పిల్లల ముందే భార్యను డంబెల్ తో !

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ భర్త బరి తెగించాడు. కట్టుకున్నాకభార్య అడ్డంగా ఉందని కడతేర్చడానికి పిల్లల ముందే వ్యాయామం చేసే డంబెల్ తో నెత్తిన బాదేశాడు. కన్న కూతుర్ల పై కూడా అసభ్యంగా ప్రవర్తించాడు ఆ నీచుడు. కాకినాడ కొవ్వూరు తారకరామ నగర్ కు చెందిన శ్రీను ఏపీఎస్ఆర్టీసిలో డ్రైవర్ చెడు వ్యసనాలకు బానిసైన అతను ఇంట్లో భార్యను కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. రెండేళ్ళ కిందట తన భార్య బంధువు ఇంటికి వస్తే ఆమెను చెరబట్టాడు. విషయం తెలిసిన […]

Continue Reading