రోడ్డెక్కిన ప్రైవేటు బస్సులు.. మరి ఆర్టీసీ సంగతేంటో?

కరోనా కారణంగా గత 5నెలలుగా నిలిచిపోయిన ప్రైవేటు బస్సు సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. అన్‌లాక్ 4లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు.ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్‌లైన్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ విధానాన్ని ఆపరేటర్లు మొదలుపెట్టారు. పరిస్థితిని బట్టి సర్వీసుల్ని పెంచేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. […]

Continue Reading

టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు జయప్రకాష్‌రెడ్డి మృతి

టాలీవుడ్ మరో విషాద ఘటన జరిగింది… క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్‌ రెడ్డి కన్నుమూశారు. ఇవాళ ఉదయం 7 గంటలకు గుంటూరులోని స్వగృహంలో మృతిచెందారు. బాత్రూమ్‌లో గుండెపోటుతో కుప్పకులారు జయప్రకాష్‌రెడ్డి… కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూలో ఉంటున్నారు. రాయలసీమ మాండలీకంతో విలనిజం పండించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి. ఇక, కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు […]

Continue Reading

తండ్రిపై చేయి చేసుకున్న కొడుకు

కుమారుడు చేయి చేసుకోవడంతో తండ్రి మృతి చెందిన ఘటన ఫిరంగిపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు వేములూరిపాడు గ్రామానికి చెందిన షేక్‌ షరీఫ్‌ (40) గౌస్య దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గౌస్య ప్రధాన రహదారిపై ఇంటి ముందు చిల్లర దుకాణం నిర్వహిస్తారు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు రఫీ ఆటో నడుపుతాడు. షరీఫ్‌ మద్యానికి బానిసయ్యాడు. తాగుడుకు వేల రూపాయలు ఖర్చు చేస్తుంటాడు. తాగినప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతూ ఇంట్లో వారిని మానసికంగా ఇబ్బంది […]

Continue Reading

కరోనా కారణంగా పెళ్లి ఆలస్యం…బెంగతో యువతి ఆత్మహత్య

కరోనా, లాక్‌డౌన్ కారణంగా పెళ్లి ఆలస్యమవుతోందన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు బెజ్జంకి మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన వడిగె శిరీష(19) డిగ్రీ వరకు చదవుకున్న ఇంటి దగ్గర ఉంటోంది. కోహెడ మండలం మైసంపల్లికి చెందిన ఓ యువకుడు, శిరీష మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరికి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. వీరి వివాహాన్ని కొన్ని మాసాల క్రితమే […]

Continue Reading

266వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు

అమరావతి: రాజధాని ప్రాంత రైతులు, మహిళల ఆందోళనలు 266వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, తదితర గ్రామాల్లోని నిరసన దీక్షా శిబిరాల్లో కరోనా సూచనలు పాటిస్తూ రైతులు తమ నిరసనలను తెలుపుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో తమ జీవితాలు తలకిందులు అయ్యాయని వాపోతున్నారు. ప్రభుత్వం తమ ఆందోళనపై స్పందించిన రాజధాని మార్పు నిర్ణయాన్ని మార్చుకోవాలి డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు తాము ఆందోళన విరమించేది […]

Continue Reading

బందరులో మహిళ దారుణ హత్య

కృష్ణా : జిల్లాలోని బందరులో దారుణం చోటు చేసుకుంది. ఓ దళిత మహిళ దారుణ హత్యకు గురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో సాక్షాత్తు మంత్రి అనుచరుడే ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. వివరాల్లోకెళితే.. సెప్టెంబర్ 4వ తేదీన హైదరాబాద్-నార్కట్‌పల్లి వద్ద పద్మజ అనే మహిళ మృతదేహం కాలిపోయి పడిఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా అసలు విషయం వెలుగు చూసింది. పద్మజ గత నెల 31వ తేదీన మచిలీపట్నంలో మిస్సైంది. పద్మజ […]

Continue Reading

గాంధీ ఆస్పత్రిలో రెచ్చిపోయిన దొంగలు..

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల బంగారు నగలు, ఫోన్లు మాయమవుతున్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు అందుతున్నాయి. వారం, పది రోజుల నుంచి ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నగలు, సెల్‌ఫోన్లు పోయినట్లు ఆరుగురు బాధితులు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ వివరాలను పోలీసులు బయటకు తెలియనీయడం లేదు. బాధితులు నిద్రపోతున్నప్పుడు, ఆదమరిచి ఉన్న సమయంలో ఈ ఘటనలు […]

Continue Reading

వార్నింగ్ : నిన్న సీఎంకి.. నేడు హోం మంత్రి, ఆ అధినేతకి..!

బెదిరింపు ఫోన్ కాల్స్.. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయంగా మారిన అంశం.. అలాగే ఆ రాష్ట్ర నాయకులకు నిద్రలేకుండా చేస్తున్న అంశం. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తరపున కాల్ చేస్తున్నానని ఆ గుర్తు తెలియని దుండగుడు బెదిరించాడు. రాత్రి 10.30 నిమిషాలకు ఆ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ ఫోన్ కాల్స్ మహారాష్ట్ర […]

Continue Reading

చేసేది దొంగతనం.. అయినా టైమ్ అంటే టైమే..

టిప్పుటాప్‌గా తయారై బైక్‌పై బయల్దేరతారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తారు. రాడ్డు, స్ర్కూడ్రైవర్‌తో ఒకరు ఇంట్లోకి చొరబడతారు.మరొకరు కొద్దిదూరంలో నిలబడి కాపలా కాస్తుంటాడు. ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి బంగారం, నగదు, వెండి సహా దొరికినంత దోచేస్తాడు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపే చోరీ చేయడం వీరి స్టైల్‌. చోరీలకు పాల్పడుతున్న గుల్బర్గా దొంగల ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 325 గ్రాముల బంగారం. కిలో […]

Continue Reading

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల స్కామ్‌లో కీలక పరిణామం

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌ భర్త, వ్యాపారవేత్త అయిన దీపక్‌ కొచ్చర్‌ అరెస్ట్‌ అయ్యారు. రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారంటూ నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు.. ఆధారాలు లభ్యమవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. వీడియో కాన్‌ గ్రూప్‌నకు 1875 కోట్ల మేర రుణాల మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారంటూ చందా కొచ్చర్‌ దంపతులతో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్‌ దూత్‌పైనా […]

Continue Reading