నాడు దొంగలుగా ముద్ర.. నేడు రైతులుగా దర్జా

ఈ చెంచులను చూసి అప్పట్లో నంద్యాలలో డీఎస్పీగా పనిచేస్తున్న కాశీనాథ్‌ చలించిపోయారు. వీరికి పునరావాసం కల్పించి సన్మార్గంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు జిల్లా కలెక్టర్‌ పాణ్యంలో ప్రత్యేకంగా చెంచు కాలనీ ఏర్పాటు చేసి, 43 ఎకరాల భూమిని కేటాయించారు. వీరికి వ్యవసాయం నేర్పేందుకు జిల్లా గిరిజన సంక్షేమాధికారికి బాధ్యతలు అప్పగించారు. సాగుకు అనుకూలంగా రెండు బోర్లు వేయడంతో పాటు గోరుకల్లు రిజర్వాయర్‌ నీటితో చెంచులకు వ్యవసాయం కలిసివచ్చింది. అప్పట్లో దొంగలుగా ముద్ర పడిన చెంచులు.. నేడు […]

Continue Reading

సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దమామ ఇసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూత

వేముల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దమామ, సీఎం సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి పెద్దనాన్న ఇసీ పెద్ద గంగిరెడ్డి (78) శనివారం కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. పులివెందులలోని ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవల స్వగ్రామం గొల్లలగూడూరులోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే శనివారం ఉదయం 5 గంటల సమయంలో పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం పులివెందులకు తరలిస్తుండగా మార్గంమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఇసీ పెద్ద గంగిరెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామమైన గొల్లలగూడూరు గ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన […]

Continue Reading

మరణాలు తగ్గుతున్నాయ్‌!

అమరావతి: రాష్ట్రంలో సుమారు ఏడు జిల్లాల్లో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్‌ కేసులు పెరిగినా ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరణాల నియంత్రణే ముఖ్యమని ఐసీఎంఆర్‌ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ సూచనలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌ చివరి రెండు వారాల్లో వైద్యారోగ్య శాఖ విశ్లేషణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతంతో పోలిస్తే గుంటూరు జిల్లాలో మరణాలు 46 శాతం పైనే తగ్గినట్టు వెల్లడైంది. అనంత, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో తగ్గుముఖం పట్టగా, […]

Continue Reading

కూతురు ఫోన్‌ రికార్డుతో బయటపడ్డ మర్డర్‌ స్కెచ్‌

తూర్పు గోదావరి : భార్య ఉండగానే వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. మహిళతో అక్రమ సంబంధానికి ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయాలని పథకం రచించాడు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండపేట సంఘం కాలనీకి చెందిన మహిళతో సతీష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా ఆమె భర్తకు తెలియడంతో పలుమార్లు ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న ఆమె భర్తను తొలగించుకోవాలని […]

Continue Reading

ఆలయ సిబ్బంది పాత్రపై దర్యాప్తు

విశాఖపట్నం: సింహాచలంలో అప్పన్న బంగారు ఆభరణాల విక్రయం పేరిట జరిగిన మోసంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారి అజాద్ పర్యవేక్షణలో కమిటీ విచారణ చేపట్టింది. హైమావతికి సహకరించిన దేవాదాయశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు మధు, శేఖర్‌లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. నెల్లూరు మహిళ శ్రావణి నుంచి ఆన్‌లైన్‌లో కోటి 40 లక్షలు తీసుకున్న విశాఖ మహిళ హైమవతిని విచారిస్తున్నామని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఆజాద్‌ తెలిపారు

Continue Reading

భారీ పెట్రోల్‌ స్కామ్‌: డిస్‌ప్లే వెనుక చిప్‌

వాహనదారులను దోచుకుంటూ పె హైదరాబాద్‌ :  వాహనదారులను దోచుకుంటూ పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంకుల్లో ఇంటిజిట్లర్టేడ్ చిప్‌లు అమర్చి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓట్ టీమ్స్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఇంటిజిట్లర్టేడ్ చిప్‌ల ద్వారా 1000 ఎమ్ఎల్ పెట్రోల్‌లో 970 ఎమ్ఎల్ మాత్రమే వస్తుందని, వాహనాల్లో పెట్రోల్ పోసేటప్పుడు డిస్‌ప్లే వెనుక ఒక చిప్ అమర్చుతారని వెల్లడించారు. […]

Continue Reading

బైక్‌ను సిమెంటు లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం

చిత్తూరు : సిమెంట్‌ లారీ మృత్యురూపంలో దూసుకొచ్చి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌ జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన శంకరయ్య భార్య రెడ్డమ్మ, కుమారుడు అఖిల్‌తో కలిసి పిలేరు నుంచి కడప జిల్లాలోని రాయచోటికి బైక్‌పై బయల్దేరాడు. గైరంపల్లి శివారు వద్దకు రాగానే అతివేగంగా దూసుకొచ్చిన సిమెంటు లోడు లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టి వీరి పైనుంచి దూసుకెళ్లడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. […]

Continue Reading

భార్య డబ్బివ్వలేదని భర్త ఆత్మహత్య

తిరుపతి: తాగుడుకు భార్య డబ్బివ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్‌ ఎస్‌ఐ వీరేష్‌ తెలిపిన వివరాల మేరకు.. కూలీ పనులు చేసుకునే కేశవ (44) తన భార్య దేవి, ఇద్దరు పిల్లలతో కలిసి తిరుపతిలోని సుందరయ్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య ఇంటివద్ద చిల్లర దుకాణం నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా.. కేశవకు కూలీ పనులు దొరక్క మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్యను వేధించి మద్యం తాగడానికి డబ్బు తీసుకునేవాడు. ఈ క్రమంలో వచ్చే కొద్దిపాటి డబ్బు […]

Continue Reading

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్ల మృతి

ఆనందంగా ఉన్న ఆ కుటుంబాన్ని మృత్యువు కకావికలం చేసింది. ట్రాక్టర్‌ రూపంలో వచ్చి తండ్రీకూతుళ్లను కుటుంబం నుంచి వేరు చేసింది.. కొండపల్లి ఏపీ టూరిజం భవనం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడికి చెందిన రెంటపల్లి చెన్నారావు వ్యవసాయ కూలీ. ఈయన తన ద్విచక్ర వాహనంపై భార్య మౌనిక, కుమార్తెలు రాజేశ్వరి, గ్రీష్మశ్రీలతో కలిసి మైలవరం మండలం కందులపాడుకు అత్తగారింటికి వెళ్లాడు. అనంతరం శనివారం మధ్యాహ్నం అదే ద్విచక్ర […]

Continue Reading

కెప్టెన్ రాహుల్‌కే ఆ బాధ్యతలు: కుంబ్లే

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించబోతున్నట్లు పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తాజాగా స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2019 సీజన్‌‌లో కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్ పంజాబ్ టీమ్‌ని నడపించగా.. ఐపీఎల్ 2020 సీజన్‌కి అతడ్ని ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. దాంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌కి అశ్విన్ వెళ్లిపోయాడు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా కింగ్స్ […]

Continue Reading